నిరాహార దీక్ష భగ్నం చేసేందుకు ఎమ్మెల్యే కుట్ర
ప్రొద్దుటూరు : ప్రజాధనమైన ఎగ్జిబిషన్ బకాయిలు సుమారు రూ.కోటి వెంటనే చెల్లించాలని కోరుతూ బుధవారం మున్సిపల్ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఆయన వెంట వైఎస్సార్‌టీయూసీ నియోజకవర్గ అధ్యక్షుడు ఖాజాపీర్, మున్సిపల్ కౌన్సిలర్లు లావణ్య, ఆరు ణ, జయంతి, సత్యంతోపాటు ప్రొద్దుటూరు కోఆపరేటివ్ స్టోర్స్ అధ్యక్షురాలు గజ్జల కళావతి, వైఎస్సార్‌సీపీ నాయకులు కమ్మక్క, మేరి, మాజీ కౌన్సిలర్ రమ ణమ్మ దీక్షలో పాల్గొన్నారు. వీరికి స్వర్ణకారుల సంఘం నాయకుడు ఉప్పర మురళి ఆధ్వర్యంలో మద్దతు తెలిపారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శిరెడ్యం వెంకటసుబ్బారెడ్డి, మాజీ ఎంపీపీ ప్రభాకర్‌రెడ్డి, టంగుటూ రు విశ్వనాథరెడ్డి, వైఎస్సార్‌సీపీ పట్టణాధ్యక్షుడు భూమిరెడ్డి వంశీధర్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్లు ఆయిల్ మిల్లు ఖాజా, పాతకోట బంగారు మునిరెడ్డి, కౌన్సి లర్లు వరికూటి ఓబుళరెడ్డి, ముదిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ యెల్లాల కుమార్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్ పిట్టా భద్రమ్మ దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. ప్రశాంతంగా మున్సిపల్ కార్యాలయం వద్ద చేస్తున్న నిరాహార దీక్షను భగ్నం చేసేందుకు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి కుట్రపన్నారని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఈసందర్భంగా తెలిపారు. ఎగ్జిబిషన్ బకాయిలు చెల్లించే వరకు తమ దీక్ష కొనసాగుతుందని రాచమల్లు తెలి పారు. జూదం నిర్వహిస్తున్నాడని దొరసానిపల్లె సర్పంచ్ భర్త మునివరపై ప్రకటన చేయగా ఆయన తన కుటుంబ సభ్యులను దీక్షా శిబిరం వద్దకు పంపారన్నారు. ఏదో ఒకటి వారు ఇక్కడ మాట్లాడితే ఘర్షణ పడి దీక్షా శిబిరాన్ని ఎత్తివేస్తారనే ఆలోచనతోనే ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఈ విధంగా వ్యూహ రచన చేశారన్నారు. అనంతరం రాచమల్లు మాట్లాడుతూ 2014 నుంచి 2019 వరకు టీడీపీ అధికారంలో ఉందని, ఆ సమయంలో వారు ఎగ్జిబిషన్ బకాయిలు సక్రమంగా చెల్లించలేదన్నారు. 2019 – 2024 వరకు తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండేళ్లు ఎగ్జిబిషన్‌లోకి ఉచిత ప్రవేశం కల్పించామన్నారు. ఉచిత ప్రవేశం కల్పించినప్పుడు జీఎస్టీ వర్తించదని తెలిపారు. అది తెలుసుకోకుండా తమ పార్టీ నాయకులు పాతకోట బలరామిరెడ్డి బకాయిలు చెల్లించాలని మాట్లాడటం సరికాదన్నారు. గత ఏడాది మీ పార్టీ కార్యకర్త బకాయి చెల్లించలేదని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున ఒత్తిడి చేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ప్రజాధనాన్ని కాపాడేందుకు తాము ఈ దీక్ష చేపడుతున్నానన్నారు. దసరా సందర్భంగా ప్రేక్షకుల నుంచి రెండింతలు ప్రవేశ రుసుం వసూలు చేశారని తెలిపారు. ఎవరి అండ చూసుకుని మున్సిపాలిటీకి బకా యి చెల్లించలేదన్నారు. అంతకుముందు ఎంపీపీ శేఖర్‌యాదవ్, మార్తల ఓబుళరెడ్డి కొబ్బరి బోండం నీళ్లు ఇచ్చి రాచమల్లుతో రిలే దీక్షను విరమింపజేశారు.
మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి


