విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
కాశినాయన : మండలంలోని వరికుంట్ల గ్రామానికి చెందిన వరికుంట్ల జయన్న (53) విద్యుదాఘాతానికి గురై బుధవారం మృతి చెందాడు. మృతుని బంధువులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. జయన్న సాగు చేసిన పంటను అడవి పందుల నుంచి కాపాడుకునేందుకు మంగళవారం పొలం దగ్గరకు వెళ్లాడు. పొలం చుట్టు కర్రలు పాతి విద్యుత్ వైర్ చుట్టి కరెంట్ తగిలిస్తుండగా ప్రమాదానికి గురై మరణించాడు. బుధవారం సాయంత్రం పశువుల కాపరులు మృతదేహాన్ని చూసి జయన్న బంధువులకు తెలిపారు. కాశినాయన ఎస్‌ఐ యోగేంద్ర సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోరుమామిళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా మృతునికి భార్య ఓబుళమ్మతోపాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ యజమాని మరణించడంతో భార్య, కుమారులు కన్నీటి పర్యంతమయ్యారు.
పెన్నా నదిలో జేసీబీని
సీజ్ చేసిన పోలీసులు
ప్రొద్దుటూరు క్రైం : పెన్నానది నుంచి అక్రమంగా ఇసుకను తోడేస్తున్న జేసీబీని రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకొని స్టేషన్‌కు తరలించారు. రామాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు జేసీబీతో ట్రాక్టర్లకు ఇసుకను నింపుకొని అక్రమంగా తరలిస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు బుధవారం సాయంత్రం దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో ఇసుకను తోడుతుండగా స్వాధీనం చేసుకొని స్టేషన్‌కు తరలించారు. స్వాధీనం చేసుకున్న జేసీబీని రెవెన్యూ అధికారులకు అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి


