జిల్లాలో వర్షం
కడప అగ్రికల్చర్: జిల్లాలోని జమ్మలమడుగు డివిజన్ పరిధిలోని నాలుగు మండలాల్లో వర్షం కురిసింది. ఇందులో ఎర్రగుంట్లలో 13.4 మి.మీ, ప్రొద్దుటూరులో 8, చాపాడులో 3.2, ముద్దనూరులో 0.4 మి.మీ వర్షం కురిసింది.
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో బద్వేలులోని బిజివేముల వీరారెడ్డి ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల మైదానంలో ఈ నెల 4వ తేదీన 35వ సబ్ జూనియ ర్స్ బాల బాలికల జిల్లా స్థాయి కబడ్డీ ఎంపికలను నిర్వహించనున్నట్లు అసోసియేషన్ ప్రెసిడెంట్ గురు శేఖర్, సెక్రటరీ వెంకట సుబ్బయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇతర వివరాలకు 99498 38864, 91334 80661 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.
కడప కార్పొరేషన్: ఏపీఎస్పీడీసీఎల్ తిరుపతి కార్పొ రేట్ కార్యాలయంలో ప్రతి సోమవారం డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సంస్థలో తొలిసారిగా డయల్ యువర్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, వైయస్సార్ కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల వినియోగదారులు 8977716661కు కాల్ చేయడం ద్వారా తమ విద్యుత్ సమస్యలను నేరుగా సీఎండీ తీసుకువచ్చి, వాటిని పరిష్కరించుకోవచ్చన్నారు. ఈనెల 3వ తేది సోమవారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వినియోగదారులు మొబైల్ నంబరు 91333 31912కు చాట్ చేయడం ద్వారా కూడా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావచ్చని పేర్కొన్నారు.
కడప సెవెన్‌రోడ్స్: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను విని యోగించుకోవాలని డీఆర్వో విశ్వేశ్వర నాయు డు ఆదివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. అర్జీదారులు తమ అర్జీలు పరిష్కారం కాకపోయినా లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్‌కు కాల్ చేయవచ్చని పేర్కొన్నారు.
పాత పీజీఆర్‌ఎస్‌లో నిర్వహణ
ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్)ను ఈ సోమవారం పాత పీజీఆర్‌ఎస్‌లో నిర్వహిస్తున్నట్లు డీఆర్వో తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలు నమోదు చేసుకోవడానికి ‘మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్’ వెబ్‌సైట్‌లో తమ అర్జీలను నమోదు చేసుకోవచ్చన్నారు.
డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం
డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 9.30 నుంచి 10.00 గంటల వరకు జరుగుతుందని డీఆర్వో తెలిపారు. ప్రజలు 08562–244437 ల్యాండ్ లైన్ నెంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలను విన్నవించుకోవచ్చునని పేర్కొన్నారు.
జమ్మలమడుగు: మైలవరం జలాశయం నిండుకుండలా మారింది. శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తడంతో పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులెటర్ ద్వారా గాలేరు–నగరి వరద కాలువ ద్వారా ప్రతిరోజూ 10వేల క్యూసెక్కుల కు పైగా నీరు గండికోట ప్రాజెక్టుకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి రెండువేల క్యూసెక్కుల నీరు మైలవరం జలాశయానికి చేరుతోంది. దీంతో మైలవరం నిండా నీటితో తొణికిస లాడుతోంది. ప్రస్తుతం మైలవరం జలాశయంలో 6.148 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయం పూర్తిస్థాయి కంటే ఎక్కువ నీరు నిల్వ ఉండటంతో ప్రతిరోజు రెండువేల క్యూసెక్కుల కంటే ఎక్కువ నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ప్రతిరోజు ఐదువేల క్యూసెక్కుల నీరు పెన్నాలోకి విడుదల చేయగా.. .ప్రస్తుతం ఆ నీటిని రెండువేలకు తగ్గించా రు. కాగా పెన్నాలోకి నీరు రావడంతో తాగు, సాగు నీటికి ఇబ్బంది ఉండదని పెన్నా పరీవాహక ప్రాంత ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మైలవరం జలా శయం నుంచి ప్రతిరోజు పెన్నాలోనికి 2183 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
జిల్లాలో వర్షం


