● పెరిగిన వ్యయం..
2001లో చెయ్యేరు, పెన్నా, గుంజన నదులకు లక్షల క్యూసెక్కులు వరద పొటెత్తింది. 30టీఎంసీలు వృథాగా పోయింది. ఈ నీటిని నిల్వ చేసుకునేందుకు సబ్ సర్ఫేస్ చెక్‌డ్యాం నిర్మించాలని అప్పటి సీఎం చంద్రబాబుఆదేశించారు.అప్పటి ఎమ్మెల్యే పసుపులేటి బ్రహ్మయ్య సీఎంను కలిసి ప్రతిపాదనలు ఇచ్చారు. 2002లో నాలుగు సర్పేస్ చెక్‌డ్యాంలు మంజూరు చేయాలని గ్రామీణాభివృద్ధి కమిషనర్ ఆదేశించారు. సీఎం గ్రామీణాభివృద్ధి, ఇరిగేషన్ అధికారులతో చర్చించారు.
● 07.07.2003లో నాబార్డు, గ్రామీణాభివృద్ధిశాఖ, నీటిపారుదలశాఖ అధికారులు సమావేశమై హైలెవల్ మానిటరింగ్ కమిటీని తెరపైకి తీసుకొచ్చారు.ఈ కమిటీ రాజంపేట, పెనగలూరు, నందలూరు మండలాల పరిధిలో ప్రవహించే చెయ్యేరు, గుంజన నదులపై నాలుగు సబ్ సర్ఫేస్‌డ్యాంల నిర్మించాలని సూచించింది. దీంతో మైనర్ ఇరిగేషన్ సెక్టార్ కింద రూ.6.45కోట్ల నిధులు మంజూరుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఆ నిధులను ఏమయ్యాయో ఇప్పటి వరకు అంతుపట్టడంలేదు.
● నీటిపారుదలశాఖ 55 చెక్‌డ్యామ్‌ల నిర్మించేందుకు ప్రాథమిక నివేదికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపింది. అప్పట్లో నిపుణుల కమిటీని జిల్లాకు పంపి వరద నీటి గణాంకాలను పరిశీలించి చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఈ విషయంలో జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుంటామని బాబు వెల్లడించారు. గతంలో వచ్చిన నిధులను నీటిపారుదలశాఖ వినియోగించుకోక పోవడం వల్ల ఇప్పుడు వ్యయం మూడురెట్లు పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో చెక్‌డ్యాంల నిర్మాణం జరుగుతుందా అనే అనుమానాలు వ్యక్తవుతున్నాయి.


