ఘనంగా బ్రహ్మంగారి జయంతి ఉత్సవాలు
గుర్రంకొండ: మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది.ఈసందర్భంగా రెడ్డెమ్మతల్లీ దీవించమ్మా అంటూ వేడుకున్నారు. అమ్మవారికి ఉదయాన్నే నైవేద్యాలు సమర్పించి విశేష పూజలు,అభిషేకాలు నిర్వహించారు. సంతానాన్ని ప్రసాదించే చల్లని తల్లిగా ప్రఖ్యాతిపొందిన అమ్మవారి ఆలయానికి ఉద యం నుంచే భక్తుల రాక మొదలైంది. ఆలయ పరిసరాల్లోని దిగువ తొట్లివారిపల్లెలో అర్చకుల కుటుంబీకులు పంపిణీ చేసే ఆకు పసరును సేవించి మహిళలు కోనేట్లో పవిత్ర స్నానమాచరించారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు.మొక్కులు తీరిన భక్తులు అమ్మవారికి బంగారు, వెండి, చీరెసారెలతో మొక్కుబడులు చెల్లించుకొన్నారు.
బ్రహ్మంగారిమఠం: కాలజ్ఞాన ప్రబోధకర్త పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 417వ జయంతి మహోత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలలో పూర్వపు మఠాధిపతి కుమారులు వెంకటాద్రిస్వామి, భద్రయ్యస్వామి, బ్రహ్మయ్యస్వామి, దత్తస్వామిలతో పాటు రెండవ భార్య కుమారులు కలసి పార్క్‌లో ఉన్న బ్రహ్మంగారి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రికి మహానంది దేవాలయం నుంచి వచ్చిన తలంబ్రాలతో గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి కల్యాణం నిర్వహించారు. కార్యక్రమంలో దేవదాయ అధికారులతో పాటు మఠం నిర్వాహకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఘనంగా బ్రహ్మంగారి జయంతి ఉత్సవాలు


