కడప కార్పొరేషన్ : తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల నుంచి వంద మంది యువకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదివారం సాయంత్రం 35వ డివిజన్‌లోని నకాష్‌లో దుబాయ్ జీనియస్ స్కూలు పక్కన నిర్వహించిన కార్యక్రమంలో 35వ డివిజన్ కార్పొరేటర్ ఎస్‌ఏ షంషీర్ ఆధ్వర్యంలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా సమక్షంలో వీరంతా వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ యువతీ యువకులు వైఎస్సార్‌సీపీ వైపు ఆకర్షితులవుతున్నారన్నారు. పార్టీలో చేరిన వారిలో ఇస్మాయిల్, గౌస్‌బాషా, కలీముద్దీన్, అహ్మద్ అలీ, అలీబాషా, నదీమ్, అలీముద్దీన్, షేక్ షఫీవుల్లా, ఆరీఫ్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకు లు బీహెచ్ ఇలియాస్, సుబాన్‌బాషా, పి.జయచంద్రారెడ్డి పాల్గొన్నారు.


