కార్మికుల హక్కులు కాలరాస్తే ఉద్యమిస్తాం
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కార్మికుల హక్కులు కాలరాస్తే ఉద్యమిస్తామని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం నగరంలోని యూటీఎఫ్ కార్యాలయంలో సీఐటీయూ జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎనిమిది గంటలు నిద్ర, ఎనిమిది గంటలు శ్రమ, ఇతర పనుల కోసం ఎనిమిది గంటలు చేయాల్సి ఉండగా వాటికి భిన్నంగా ప్రభుత్వం వ్యవహరిస్తుండటం దుర్మార్గమన్నారు. రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ప్రభాకర్ రెడ్డి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ మాట్లాడుతూ డిసెంబర్ 31, జనవరి 4 , 2026 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే సీఐటీయూ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శులు కె. సత్యనారాయణ, వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.


