డ్రాగా ముగిసిన ఏసీఏ సౌత్‌జోన్ అండర్–14 మల్టీ డే మ్యాచ
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ఏసీఏ సౌత్‌జోన్ అండర్–14 మల్టీ డే మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. రెండవ రోజు వైఎస్‌ఆర్‌ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో కర్నూలు–కడప జట్ల మధ్య మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆదివారం రెండవ రోజు 68 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ మ్యాచ్‌ను ప్రారంభించిన కడప జట్టు 89.3 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 249 పరుగులకు డిక్లేర్డ్ చేసింది. ఆ జట్టులోని తాహిర్ 63 పరుగులు, ఆష్‌ఖాన్ 49 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని యశ్వంత్ సూర్య 3 వికెట్లు, అఖిత్ ఫరీక్ 2 వికెట్లు తీశారు. అనంతరం రెండవ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కర్నూలు జట్టు 31 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 58 పరుగులు చేసింది. ఆ జట్టులోని రిషి 27 పరుగులు చేశాడు. కడప జట్టులోని ముని జ్ఞానేశ్వర్ 3 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో కడప జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యత సాధించింది.
కేఓఆర్‌ఎం క్రికెట్ మైదానంలో...
అదే విధంగా కేఓఆర్‌ఎం క్రికెట్ మైదానంలో అనంతపురం –నెల్లూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. రెండవ రోజు 86 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన అనంతపురం జట్టు 83.4 ఓవర్లకు 242 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని మోక్షజ్ఞ తేజ 84 పరుగులు చేశాడు. నెల్లూరు జట్టులోని సాయి చరణ్ 4 వికెట్లు తీశాడు. అనంతరం రెండవ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన నెల్లూరు జట్టు 45 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ఆ జట్టులోని ఎస్‌కే సమీర్ 59 పరుగులు చేశాడు. అనంతపురం జట్టులోని రోహితేశ్వర్ రాజు 3 వికెట్లు తీశాడు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. అనంతపురం జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యత సాధించింది.
సాయి చరణ్,
నెల్లూరు, (4 వికెట్లు)
ముని జ్ఞానేశ్వర్,
కడప, (3 వికెట్లు)
తాహిర్, కడప
(63 పరుగులు)
ఆష్‌ఖాన్, కడప
(49 పరుగులు)
మోక్షజ్ఞ తేజ, అనంతపురం (84 పరుగులు)
డ్రాగా ముగిసిన ఏసీఏ సౌత్‌జోన్ అండర్–14 మల్టీ డే మ్యాచ
డ్రాగా ముగిసిన ఏసీఏ సౌత్‌జోన్ అండర్–14 మల్టీ డే మ్యాచ
డ్రాగా ముగిసిన ఏసీఏ సౌత్‌జోన్ అండర్–14 మల్టీ డే మ్యాచ
డ్రాగా ముగిసిన ఏసీఏ సౌత్‌జోన్ అండర్–14 మల్టీ డే మ్యాచ


