గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇరువురికి గాయాలు
మైదుకూరు : మైదుకూరు – ప్రొద్దుటూరు రహదారిలో పట్టణ శివారులో ఉన్న బైపాస్ సమీపంలో శనివారం గుర్తు తెలియని వాహనం ఢీకొని ద్విచక్రవాహనంపై వెళుతున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామానికి చెందిన అజీజ్ బాషా, బాబు అనే వ్యక్తులు ఇంటి నిర్మాణంలో టైల్స్ వేసే పని చేస్తుంటారు. శనివారం మైదుకూరులో ఓ ఇంటిలో టైల్స్ పని చేసి తిరిగి గ్రామానికి బైక్‌పై వెళుతుండగా బైపాస్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ సంఘటనలో అజీజ్‌బాషా, బాబుకు తలకు తీవ్ర గాయాలయ్యాయి. మైదుకూరు ప్రభుత్వాస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం వారిని మెరుగైన చికిత్స కోసం 108 అంబులెన్స్‌లో ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
అదుపు తప్పిన స్కూల్ బస్సు
కాశినాయన : మండలంలోని కొట్టాలపల్లె చెరువు కట్టమీద శనివారం ప్రైవేట్ స్కూల్ టైర్ పంచర్ కావడంతో వరి మళ్లలోకి వెళ్లింది. డ్రైవర్ చాకచక్యంతో బస్సును పొలాల్లోకి దింపాడు. ఆ సమ యంలో బస్సులో ఐదుగురు విద్యార్థులు ఉండగా వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. వెంటనే స్థానికులు పిల్లలను బయటికి తీసుకొచ్చారు.
కుక్కల దాడిలో
18 గొర్రెలు మృతి
ఖాజీపేట : గొర్రెల మందపై కుక్కల గుంపు దాడి చేయడంతో సుమారు 18 గొర్రెలు మృతి చెందాయి. ఖాజీపేట మండలం త్రిపురవరం గ్రామానికి చెందిన బత్తల ఓబులేసు యాదవ్‌కు గొర్రెలు ఉన్నాయి. శనివారం కమలాపురం మండలం కొత్తపల్లె గ్రామంలోని పొలాల్లో మేపు కోసం గొర్రెలను వదిలి వెళ్లి విశ్రాంతి తీసుకుంటుండగా ఒక్కసారిగా కుక్కల గుంపు వచ్చి దాడి చేసింది. ఈ దాడిలో సుమారు 18 గొర్రెలు మృతి చెందగా మరో 10 తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడుతున్నాయి. ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇరువురికి గాయాలు
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇరువురికి గాయాలు


