ఏసీఏ సౌత్‌జోన్ అండర్–14 మల్టీ డే మ్యాచ్‌లు ప్రారంభం
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ఏసీఏ సౌత్‌జోన్ అండర్–14 మల్టీ డే మ్యాచ్‌లు శనివారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు వైఎస్‌ఆర్‌ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో కర్నూలు–కడప జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిన కర్నూలు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కర్నూలు జట్టు నిర్ణీత 69.5 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని రిషిత్ 44 పరుగులు చేశాడు. కడప జట్టులోని మునిజ్ఞానేశ్వర్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు తీశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కడప జట్టు 24 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 68 పరుగులు చేసింది. ఆ జట్టులోని ఆష్‌ఖాన్ (31) నాటౌట్‌గా నిలిచాడు. కర్నూలు జట్టులోని హేమంత్ ఒక వికెట్ తీశాడు. దీంతో కడప జట్టు కర్నూలు స్కోరు కంటే 57 పరుగులు వెనుకంజలో ఉంది. దీంతో తొలి రోజు ఆట ముగిసింది.
కేఓఆర్‌ఎం క్రికెట్ మైదానంలో..
కేఓఆర్‌ఎం క్రికెట్ మైదానంలో తొలి రోజు అనంతపురం –నెల్లూరు జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన నెల్లూరు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 58.5 ఓవర్లలో 186 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని కిన్ను కిషల్ 48 పరుగులు చేశాడు. అనంతపురం జట్టులోని రోహిత్ రెడ్డి అద్భుతంగా బౌలింగ్ చేసి 6 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్‌ను ప్రారంభించిన అనంతపురం జట్టు 37 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. నెల్లూరు జట్టులోని శ్రీచరణ్ 2 వికెట్లు, తీశాడు.
రిషిత్, కర్నూలు
(44 పరుగులు)
రోహిత్ రెడ్డి,
అనంతపురం (6 వికెట్లు)
జ్ఞానేశ్వర్, కడప
(4 వికెట్లు)
ఏసీఏ సౌత్‌జోన్ అండర్–14 మల్టీ డే మ్యాచ్‌లు ప్రారంభం
ఏసీఏ సౌత్‌జోన్ అండర్–14 మల్టీ డే మ్యాచ్‌లు ప్రారంభం


