హోంగార్డ్స్ సంక్షేమానికి ప్రాధాన్యత
కడప అర్బన్ : హోంగార్డుల సంక్షేమానికి పోలీసు శాఖ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని హోంగార్డ్స్ కమాండెంట్ ఎం.మహేష్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ షె ల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు ఆయన హోంగార్డ్ యూనిట్ల పరిశీలన నిమిత్తం జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ఉమేష్ చంద్ర కల్యాణ మండపంలో హోంగార్డులకు దర్బార్ పెరేడ్ నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దురలవాట్లకు దూ రంగా వుండి క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ పోలీ స్ శాఖకు మంచి పేరు తీసుకురావాలన్నారు. అలాగే పీఎంజేజేబీవై, పీఎంఎస్‌బీవై పాలసీలు రెన్యూవల్ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ శ్రీశైలరెడ్డి, హోంగార్డ్స్ పాల్గొన్నారు.
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : రాష్ట్రంలో పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఎంఎస్‌ఎంఈల ద్వారా పరిశ్రమలు ఏర్పాటు చేసి రాయితీ రాని ఎస్సీ ఎస్టీలు ఈనెల 3తేదీ సోమవారం కడప కలెక్టరేట్ వద్దకు రావాలని సీపీఐ జిల్లా కార్యదర్శి చంద్ర కోరారు. శనివారం నగరంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంఎస్‌ఎంఈ ద్వారా పరిశ్రమలు ఏర్పాటు చేసిన ఎస్సీ ఎస్టీలు 2021 ఆగస్టు నుంచి సబ్సిడీ రాక రుణాలు ఇచ్చిన బ్యాంకుల ఒత్తిళ్లతో అధిక వడ్డీలకు అప్పుచేసి ఈఎంఐ చెల్లిస్తూ అప్పుల ఊబిలో కూరుకుపోయారన్నారు. కూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా సబ్సిడీ రాని ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఈనెల 3 తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేయనున్నట్లు తెలిపారు.
హోంగార్డ్స్ సంక్షేమానికి ప్రాధాన్యత


