కాశీబుగ్గ ఘటన విషాదకరం
పులివెందుల : శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 9 మంది ప్రాణాలు కోల్పోవడం విషాదకరమని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ఆలయంలో భక్తులు వేల సంఖ్యలో రావడంతో తొక్కిసలాట జరిగిందన్నారు. ఏకాదశి రోజున ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమన్నారు. గతంలో కూడా తిరుపతిలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుందన్నారు. తరుచూ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వ యంత్రాంగం అందుకు సంబంధించి పటిష్టమైన చర్యలు తీసుకోకపోవడం విచారకరమన్నారు. కాశీ బుగ్గలో వేలాది మంది భక్తులు తరలి వస్తారని తెలిసినప్పుడు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టి ఉండాల్సిందన్నారు. ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలన్నారు. అలాగే మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి కుటుంబాలకు ప్రభుత్వం మెరుగైన ఎక్స్‌గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని ఆయన కోరారు.
ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి


