అనుమతులు లేనిచోట ఇసుక అక్రమ రవాణా
సాక్షి ప్రతినిధి, కడప : అధికారికంగా ఇసుక అనుమతులు లేకపోయినా టీడీపీ నేతలు బరి తెగిస్తున్నారు.అధికారం అండతో ప్రకృతి వనరులను ధ్వంసం చేస్తున్నారు. ఉచిత ఇసుక మాటున అక్రమార్జనే ధ్యేయంగా వెంకయ్యకాలువ గ్రామ సమీపంలోని చిత్రావతినదిలో అనుమతులు లేకున్నా.. నిబంధనలు నదిలో తొక్కి మరీ ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు.జమ్మలమడుగు నియోజకవర్గంలోని కొండాపురం మండలం ఏటూరు ఇసుక రీచ్‌కు అనుమతి ఒకచోట పెట్టుకొని వెంకయ్యకాలువ గ్రామ సమీపంలోని చిత్రావతి నదిలో అనుమతులు లేనిచోట పగలు రాత్రి తేడాలేకుండా పొక్లెయిన్లు ఏర్పాటు చేసి టిప్పర్,లారీల ద్వారా ఇసుకను అక్రమంగా తరలిస్తూ లక్షలాది రూపాయాలు ఆర్జిస్తున్నారు. ఇసుక దోపిడీని అరికట్టాల్సిన మైనింగ్ ,పోలీస్, రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారు.


