ఎన్‌జీసీ జిల్లా కోఆర్డినేటర్‌గా విజయ ప్రసాద్
కడప ఎడ్యుకేషన్ : నేషనల్ గ్రీన్ కార్‌ప్స్ కడప జిల్లా కో ఆర్డినేటర్ ఏబీ విజయప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు డీఈఓ షేక్ షంషుద్దీన్ శుక్రవారం నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ పాఠశాలలో నేషనల్ గ్రీన్ కార్‌ప్స్(ఎన్‌జీసీ) కార్యక్రమాలను విస్తృత పరిచడం ద్వారా విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ మీద అవగాహన పెంపొందించాలని సూచించారు. ఎన్‌జీసీ కో ఆర్డినేటర్ విజయ ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులకు పర్యావరణ అంశాల మీద పట్టు సాధించడం కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం వివిధ పోటీలు, ఎబ్జిబిషన్లు, ప్రాజెక్టులు, నేజర్ క్యాంపులు వంటివి నిర్వంచనున్నట్లు తెలిపారు.


