బ్రహ్మంగారి నివాసానికి పూర్వ వైభవం | - | Sakshi
Sakshi News home page

బ్రహ్మంగారి నివాసానికి పూర్వ వైభవం

Nov 1 2025 7:42 AM | Updated on Nov 1 2025 7:42 AM

బ్రహ్

బ్రహ్మంగారి నివాసానికి పూర్వ వైభవం

బ్రహ్మంగారిమఠం : కాలజ్ఞాన ప్రబోధ కర్త పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నివసించిన గృహానికి పూర్వ వైభవం కల్పించేలా చర్యలు చేపట్టనున్నట్లు ఇంటాక్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ మెంబర్‌, కడప చాప్టర్‌ కన్వీనర్‌ కె. చిన్నపరెడ్డి పేర్కొన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు బ్రహ్మంగారు నివాసమున్న గృహం పాక్షికంగా కూలిపోయిన నేపథ్యంలో కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ ఆదేశాల మేరకు ఇంటాక్‌ ప్రతినిధులతోపాటు దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ మల్లికార్జున ప్రసాద్‌, బ్రహ్మంగారిమఠం మేనేజర్‌ ఈశ్వరాచారి తదితరులు శుక్రవారం కూలిపోయిన బ్రహ్మంగారి నివాసాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా దివంగత పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి కుమారులు, దివంగత పీఠాధిపతి సతీమణి మహాలక్షుమ్మ, స్థానిక భక్తులతో వీరు చర్చించారు. కూలిపోయిన బ్రహ్మంగారి నివాసం పాత స్వరూపం చెడిపోకుండా మరమ్మతు చేయిస్తే ఈ నివాసాన్ని దర్శించుకునే భక్తులకు బ్రహ్మంగారి కాలంనాటి వైభవాన్ని గుర్తుకు తెచ్చినట్లు అవుతుందనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఇంటాక్‌ ప్రతినిధులు ఓ.వెంకటేశ్వర రెడ్డి, టీఎస్‌ గౌరీ శంకర్‌, స్థానిక భక్తులు ఈశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రైవేట్‌ ట్రావెల్స్‌పై

నిరంతర నిఘా

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : ఇటీవల కాలంలో కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం నేపథ్యంలో వై ఎస్‌ఆర్‌ కడప జిల్లాలో రవాణా శాఖ ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సులను విస్తారంగా తనిఖీ చేసి నిరంతరం నిఘా ఉంచుతున్నట్లు జిల్లా ఇన్‌చార్జ్‌ ఉప రవాణా శాఖ కమినర్‌ వీర్రాజు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులోని సీట్‌ ఆల్టర్నేషన్స్‌, ఫైర్‌ డిటెక్షన్‌ అలారమ్స్‌, అగ్ని ప్రమాద నియంత్రణ పరికరాలు, ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ పనితీరును నిశితంగా పరిశీలించడం జరిగిందన్నారు. గత 7 రోజులలో జిల్లాలో 102 ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సులను పరిశీలించి అందులో 59 బస్సులపై కేసులు రాశామన్నారు. రోడ్డు భద్రత నియమాలకు విరుద్ధంగా ఉన్న 3 బస్సులను సీజ్‌ చేశామన్నారు. అదేవిధంగా జిల్లాలోని అన్ని స్కూలు బస్సులు మరియు కాలేజీ బస్సులను తనిఖీ చేయమని రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు వచ్చే పది రోజులలో అన్ని స్కూల్‌ బస్సులలో ఎమర్జెన్సీ ఎగ్జిట్‌, స్పీడ్‌ గవర్నర్‌, అగ్ని ప్రమాద నియంత్రణ పరికరాలు, హ్యాండ్‌ బ్రేక్‌, సర్వీస్‌ బ్రేక్‌ మొదలైన అన్ని రోడ్డు భద్రతా పరికరాలను సిద్ధంగా చేసుకోవాలని స్కూల్‌ యాజమాన్యాలకు నోటీసుల ద్వారా తెలియజేయడమైనదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న బస్సులను సీజ్‌ చేస్తామని తెలిపారు.

బ్రహ్మంగారి నివాసానికి పూర్వ వైభవం 1
1/1

బ్రహ్మంగారి నివాసానికి పూర్వ వైభవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement