చిన్నరంగాపురంలో కొండచిలువ ప్రత్యక్షం
పులివెందుల రూరల్ : పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని చిన్నరంగాపురం గ్రామంలో రైతు మల్లికార్జునరెడ్డి తోటలో శుక్రవారం కొండ చిలువ పాము ప్రత్యక్ష్యమైంది. రైతు తన పొలంలో గడ్డి కోస్తుండగా కొండ చిలువ కనిపించింది. భయంతో గ్రామస్తులు, స్థానికులు తోట వద్దకు వెళ్లి కొండ చిలువ పామును చంపేవారు.
రేపు టెన్నికాయిట్ ఎంపికలు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : పులివెందులలోని ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఆదివారం టెన్నికాయిట్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి.రామసుబ్బారెడ్డి , జి.వి.రమణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న వారు ఈ నెల 7 నుంచి 9 వరకు మూడు రోజుల పాటు బాపట్ల జిల్లా చీరాలలో జరిగే రాష్ట్ర స్థాయి జూనియర్ టెన్నికాయిట్ పోటీలలో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. 18 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న వారు ఈ ఎంపికల లో పాల్గొనవచ్చని తెలిపారు. రవాణా చార్జీలను అసోసియేషన్ భరిస్తుందని తెలిపారు. ఎంపికలకు వచ్చే క్రీడాకారులు ఒరిజినల్ ఆధార్ కార్డ్ తీసుకోని రావాలని కోరారు. ఇతర వివరాలకు 91826 61748 నెంబర్‌ను సంప్రదించాలని కోరారు
ప్రకృతి వ్యవసాయ
అరటి పంట పరిశీలన
మైదుకూరు : మైదుకూరు మండలంలోని టి.కొత్తపల్లెకు చెందిన పుత్తా వెంకటసుబ్బారెడ్డి, ఆదిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన వెంకటరామయ్య పొలాల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్న అరటి పంటను శుక్రవారం యూకేలోని రీడింగ్ యూనివర్సిటీకి చెందిన నేల, పర్యావరణ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ క్రిస్ కాలిన్స్ బృందం పరిశీలించారు. ప్రధాన పంటకు ముందు 30 రకాల విత్తనాలతో సాగు చేసిన పీఎండీసీ విధానాన్ని ప్రొఫెసర్ కాలిన్స్ రైతు శ్వేతను అడిగి తెలుసుకున్నారు. అలాగే పంట కాండం, ఆకులు నాణ్యతను పరిశీలించారు. మట్టి నమూనాలను సేకరించారు. కార్యక్రమంలో ఆదర్శ రైతు రామనందారెడ్డి పాల్గొన్నారు.
చిన్నరంగాపురంలో కొండచిలువ ప్రత్యక్షం


