ప్రశాంతంగా ఇంటర్ నాన్ టీచింగ్ ఉద్యోగుల పదోన్నతి కౌన్
కడప ఎడ్యుకేషన్ : రాయలసీమ పరిధిలోని కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం ఉమ్మడి జిల్లాల పరిధిలో ఇంటర్మీడియట్ నాన్ టీచింగ్‌కు సంబంధించిన పదోన్నతి కౌన్సెలింగ్ ప్రశాంతంగా జరిగింది. కడప ఇంటర్ ఆర్‌జేడీ కార్యాలయంలో శుక్రవారం ఇంటర్ ఆర్‌జేడీ సురేష్‌కుమార్ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్‌ను నిర్వహించారు. నాలుగు జిల్లాలకు సంబంధించిన 18 మంది జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లగా పదోన్నతికి కల్పించారు. ఇందులో ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి ముగ్గురికి, ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి ఐదుగురికి, ఉమ్మడి అనంతపురం జల్లాకు సంబంధించి నలుగురికి, ఉమ్మడి కర్నూల్ జిల్లాకు సంబంధించి ఆరుగురు జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లగా పదోన్నతి కల్పించి నిర్వహించి వారికి స్థానాలకు కేటాయించారు. కౌన్సెలింగ్‌లో తిరుపతి జిల్లా ఆర్‌ఐవో రాజశేఖర్‌రెడ్డి, సత్యసాయి జిల్లా డీవీఈఓ చెన్నకేవశ ప్రసాద్, కడప డీవీఈఓ వెంకటేశ్వర్లు, ఆర్‌జేడీ కార్యాలయ ఏవో రూపానాయక్ తదితరులు పాల్గొన్నారు.
రాయలసీమ పరిధిలో
18 మందికి పదోన్నతులు


