పరిశోధనలపై ఆసక్తి పెంచుకోవాలి
కడప ఎడ్యుకేషన్ : విద్యార్థి దశ నుంచి పరిశోధనల పట్ల ఆసక్తిని పెంచుకోవాలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ బిందు మాధవ రెడ్డి అన్నారు. ఆయన యోగి వేమన విశ్వవిద్యాలయంలో శుక్రవారం స్కాలర్లకు, విద్యార్థులకు ‘డయాబెటిస్, కేన్సర్‌లో శక్తి సమతుల్యత (ఎనర్జీ హోమియోస్టాసిస్ ఇన్ డయాబెటిస్ అండ్ క్యాన్సర్)’ అనే అంశంపై అతిథి ఉపన్యాసం ఇచ్చారు. కేన్సర్ డయాబెటిస్‌పై ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనలు గురించి అవగాహన కల్పించారు. ఈ రెండు రంగాలలో జరుగుతున్న పరిశోధనలు, యువ పరిశోధకుల భాగస్వామ్యం గురించి ప్రస్తావించారు. మరో ప్రొఫెసర్ రాజమోహన్ రాయ్ యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగాలంటే ఎలాంటి ఆలోచన విధానాలు ఉండాలి, లక్షణాలను అలవర్చుకోవాలో అవగాహన కల్పించారు. వైవీయూ వీసీ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ ఆచార్య బిందు మాధవరెడ్డిని, ప్రొ రాజమోహన్ రాయ్‌లను విశ్వవిద్యాలయం తరపున సత్కరించారు.


