ముగిసిన ఎస్‌జీఎఫ్ బ్యాడ్మింటన్ పోటీలు
ఎంపికై న అండర్–14, 17 బాలుర జట్టు
ఎంపికై న అండర్–14, 17 జిల్లా స్థాయి బాలికల జట్లు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : కడప డీఎస్‌ఏ ఇండోర్ స్టేడియంలో గురువారం ఎస్‌జీఎఫ్ బ్యాడ్మింటన్ పోటీలు గురువారం ముగిశాయి. ఎస్‌జీఎఫ్ సెక్రటరీలు శ్రీకాంత్‌రెడ్డి, చంద్రావతి, బ్యాడ్మింటన్ అంతర్జాతీయ అంపైర్ జిలానీబాషా విలేకరులతో మాట్లాడుతూ అండర్–14, అండర్–17 విభాగంలో జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ జట్టుకు ఎంపికలు నిర్వహించామని, సుమారు 250కి పైగా క్రీడాకారులు హాజరయ్యారన్నారు. మండల, నియోజకవర్గ స్థాయిలో ఎంపికలు జరిపిన అనంతరం జిల్లాస్థాయి పోటీలకు పంపించడం జరిగిందన్నారు. అన్ని నియోజకవర్గాల నుండి విచ్చేసిన బాలబాలికలకు విడివిడిగా పోటీలు నిర్వహించి ప్రతి కేటగిరీకి ఐదుగురు చొప్పున ఎంపికచేశామన్నారు. జిల్లా స్థాయికి ఎంపికై న వారిని నవంబర్ 5, 6వ తేదీలలో తిరుపతిలో జరిగే అండర్–17, నవంబరు 25, 26వ తేదీలలో గన్నవరంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపుతున్నామని తెలిపారు. ఎంపికై న క్రీడాకారులకు కడప, ప్రొద్దుటూరు సెంటర్లలో శిక్షణ ఇప్పించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా స్థాయి బ్యాడ్మింటన్‌కు ఎంపికై న క్రీడాకారుల వివరాలు ఇలా ఉన్నాయి.
అండర్–17 బాలుర జట్టు :
జి.వేదవ్యాసశర్మ, ఎస్.అమానుల్లాఖాన్, ఎల్.సుప్రీత్‌రెడ్డి, సి.త్రివిక్రమ్, డి.విశ్వనాథ్
అండర్–17 బాలికల జట్టు :
ఎం.రమ్యశ్రీ, బి.హరిణి, లలితాబాయ్, కె.ప్రణవి, కె.శ్రీశరణ్య, బి.భార్గవి
అండర్– 14 బాలుర జట్టు :
డి.ఈశ్వర్‌ప్రసాద్‌రెడ్డి, ఏఎస్.ఆదినారాయణరెడ్డి, ఎం.ఆదిత్య, జె.శ్రీకర్‌రెడ్డి, పిబిజి.వర్షిత్
అండర్–14 బాలికల జట్టు : ఎల్.పూర్వజ, వి.శ్రీకావ్య, జి.ఆరాధ్య, ఎస్.శృతిక, కె.హ్రితిక
ముగిసిన ఎస్‌జీఎఫ్ బ్యాడ్మింటన్ పోటీలు


