జంతువుల కొవ్వు నుంచి ఆయిల్ తయారీ
చింతకొమ్మదిన్నె : మండలంలోని చెర్లోపల్లె జగనన్న కాలనీలో జన నివాసాల వద్ద ఎలాంటి అనుమతులు, లైసెన్సులు లేకుండా జంతువుల కొవ్వు, వ్యర్థాల నుంచి ఆయిల్ తయారు చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు సీకే.దిన్నె సీఐ బాలమద్దిలేటి, ఎస్‌ఐ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. ఓ ఇంటిలో షేక్‌నూర్‌మహమ్మద్ అనే వ్యక్తి జంతువుల వ్యర్థాలు, కళేబరాలు, కొవ్వు సేకరించి వాటి నుంచి ఆయిల్ తయారు చేస్తున్నట్లు సమాచారం అందింది. ఈ మేరకు చింతకొమ్మదిన్నె పోలీసులు తనిఖీలు చేసి తయారుచేస్తున్న నూనెను స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత ఆయిల్, వివిధ రకాల వాడకం కొరకు ఇతర రాష్ట్రాలలో విక్రయిస్తున్నట్లు సీఐ తెలిపారు. కేసును మరింత లోతుగా, కఠినంగా విచారిస్తే సంచలన విషయాలు బయటపడతాయని సమాచారం.
యువకుడి అదృశ్యంపై కేసు నమోదు
మైదుకూరు : మైదుకూరు మండలం గుడ్డివీరయ్య సత్రం గ్రామానికి చెందిన శ్రీరాముల వెంకటయ్య అనే యువకుడు కనిపించడం లేదని అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లుఅర్బన్ సీఐ కె.రమణారెడ్డి తెలిపారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థల కారణంగా వెంకటయ్య ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు సీఐ పేర్కొన్నా రు. యువకుని చెల్లెలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.


