ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించాలి
కడప ఎడ్యుకేషన్ : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడమే ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష ఉద్దేశ్యమని పాఠశాల విద్య ఆర్‌జేడీ శామ్యూల్, డీఈఓ షేక్ షంషుద్దీన్ పేర్కొన్నారు. కడప ఆర్జేడీ కార్యాలయంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు కేఎస్.లక్ష్మణరావు రూపొందించిన ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష స్టడీ మెటీరియల్‌ను వారు గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్జేడీ మాట్లాడుతూ స్టడీ మెటీరియల్ విద్యార్థులకు మరింత మార్గదర్శకంగా ఉంటుందని, ఇలాంటి సేవాకార్యక్రమాలు నిర్వహించడం ప్రశంసనీయమని అన్నారు. డీఈఓ మాట్లాడుతూ ఎన్‌ఎంఎంఎస్ పరీక్షలో మెరుగైన ఫలితాలను సాధించేందుకు మెటీరియల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. విద్యా ప్రేరణాత్మక కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా, జేవీవీ నాయకులు రాహుల్, సమీర్ బాషా, శివరాం, సరస్వతి, జీసీడీవో దార్ల రుతుఆరోగ్యమేరీ, నర్సింహారెడ్డి, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.


