నాలుగు రోజులుగా రాకపోకలు బంద్
బి.కోడూరు : మండలంలోని మేకవారిపల్లె చిన్నచెరువు అలుగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో నాలుగు రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. వివిధ పనుల నిమిత్తం బి.కోడూరు మండల కేంద్రం, సిద్ధయ్యగారి మఠం, బ్రహ్మంగారిమఠానికి జనం రాకపోకలు సాగించలేకపోయారు. కొందరు బి.కోడూరుకు చేరుకుని 15 కిలోమీటర్ల మేర తిరిగి సిద్దయ్యగారిమఠం, బ్రహ్మంగారిమఠానికి వెళ్తున్నారు. మేకవారిపల్లె చిన్న చెరువు అలుగు వద్ద పైపులు వేసి కల్వర్టు నిర్మించి ఉంటే ఇబ్బందులు ఎదురయ్యేవికాదని మండల వాసులు తెలిపారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని మండల వాసులు కోరుతున్నారు.


