వైవీయూలో జార్ఖండ్ టస్సర్ సిల్క్ పట్టు పురుగు
కడప ఎడ్యుకేషన్ : జార్ఖండ్ రాష్ట్రంలో కనిపించే టస్సర్ సిల్క్ పట్టు పురుగులు వైవీయూలో బుధవారం కనిపించాయి. వైవీయూ పరిశోధకులు నల్లమల, లంకమల అడవులలో పెరిగే వృక్ష జాతులను సేకరించి క్యాంపస్‌లో పెంచుతున్న విషయం అందరికీ తెలిసిందే. వీటిలో టెర్మినాలియా ఎలిపికా, టెర్మినాలియా అర్జునా వంటి వృక్ష జాతులు ఉన్నాయి. టెర్మినాలియా జాటి చెట్లపై టస్సర్ సిల్క్ పట్టు పురుగులు(ఆంథిరా మిల్లిగా)జీవిస్తున్నాయి. ఇవి ఎక్కువగా జార్ఖండ్ అడవులలో కనిపిస్తాయి. ఈ టస్సర్ సిల్క్ పట్టు పురుగును పర్యావరణశాఖ విద్యార్థులు సేకరించారు. ఈ పురుగులు 300–500 గ్రుడ్లును పెట్టి అంతరించిపోతాయని, ఆ తరువాత గ్రుడ్ల నుంచి లార్వా, ప్యూప, కక్కూన్ దశలు ఉంటాయని విద్యార్థులు తెలిపారు.
వైవీయూలో జార్ఖండ్ టస్సర్ సిల్క్ పట్టు పురుగు


