వ్యక్తి ఆత్మహత్య
చక్రాయపేట: మండలంలోని పోలిశెట్టిపల్లెకు చెందిన మాచనబోయిన సిద్ధయ్య(50) బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్థులు, బంధువుల కథనం మేరకు సిద్ధయ్య గత కొంత కాలంగా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి తోడు ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలు ఉండడంతో శరీరంపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఈ విషయాన్ని గుర్తించిన గ్రామస్థులు వెంటనే సిద్ధయ్యను నాగలగుట్టపల్లెకు తీసుకొచ్చి ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం కడప రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ అక్కడ మృతి చెందినట్లు వారు తెలిపారు. సిద్ధయ్య భార్య కూడా ఏడాది క్రితం ఆత్మహత్య చేసుకుంది.
విద్యుత్ షాక్‌తో ఒకరు మృతి
లింగాల : మండలంలోని దొండ్లవాగు గ్రామంలో విద్యుత్ షాక్‌కు గురై గొడ్డలి వెంకట్రాములు (60) బుధవారం మృతిచెందాడు. ఎస్‌ఐ అనిల్‌కుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బుధవారం ఉదయం వెంకట్రాములు తన ఇంటిలో విద్యుత్ స్విచ్ బోర్డు మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. అతడకి భార్య, కుమారుడు ఉన్నారని తెలిపారు. వెంకట్రాములు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.


