భక్తుల మనోభావాలకు ఇబ్బంది కల్గించవద్దు
బ్రహ్మంగారిమఠం : పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నివసించిన నివాసం భారీ వర్షాలకు కూలిపోయింది. భక్తుల మనోభావాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మరో ఐదు నెలల్లో పూర్తిస్థాయి నిర్మాణాలు చేపడతామని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. బుధవారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఆయన బ్రహ్మంగారి నివాసాన్ని బద్వేల్ ఆర్డీవో చంద్ర మోహన్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంత మఠం నిర్వాహకుల నిర్లక్ష్యం ఉన్నట్లు తెలుస్తోందని తెలిపారు. బ్రహ్మంగారు నివాసం ఉన్న చోట ఒకవైపు మాత్రమే మిద్దె కూలిపోయిందని.. మరోవైపు బాగానే ఉందన్నారు అయితే భక్తుల సౌకర్యం కోసం పూర్తిస్థాయిలో నిర్మాణాలు చేపట్టి భక్తులకు అందుబాటులో తేవాలని ఆదేశిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దారు కార్తీక్, ఎంపీడీవో రామచంద్రారెడ్డి, ఎండోమెంట్ ఏసీ మల్లికార్జునప్రసాద్, మఠం మేనేజర్ ఈశ్వరాచారి, దేవాదాయ శాఖ ఇంజినీర్లు పాల్గొన్నారు.
కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి


