జిల్లా వ్యాప్తంగా వర్షాలు
కడప అగ్రికల్చర్ : మోంఽథా తుపాన్ కారణంగా మంగళవారం ఉదయం నుంచి బుధవారం వరకు జిల్లావ్యాప్తంగా వర్షాలు కురిశాయి.
● నీట మునిగిన రైతన్నల ఆశలు
● జిల్లావ్యాప్తంగా 1233 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం
● 4378.23 హెక్టార్లలో
వ్యవసాయ పంటలకు నష్టం
కడప అగ్రికల్చర్ : మోంఽథా తుపాన్ జిల్లా రైతులను ముంచేసింది. రైతన్నల ఆశలపై నీళ్లు చల్లింది. పంట సాగుకోసం శ్రమటోడ్చిన అన్నదాతలకు చివరికి కన్నీరే మిగిల్చింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు రైతుల పంటలన్నీ నీటిలో తేలియాడుతున్నాయి. చేతికొచ్చిన పంట వర్షపు నీటిలో నానుతుండడం చూసి రైతన్నలు కన్నీటి పర్యంతమయ్యా రు. జిల్లాలో వరితోపాటు ప్రధాన పంటలన్నీ పూర్తి గా కోల్పోయి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోంథా తుపాన్‌కంటే ముందు కురిసిన తుఫాన్ వర్షాలకు కూడా జిల్లావ్యాప్తంగా దాదాపు 8 వేల ఎకరాల్లో పత్తి, మినుము, వేరుశనగ, మొక్కజొన్న, వరి పంటలు దెబ్బతిన్నాయి. ఆ నష్టం మరువకముందే మళ్లీ మోంథా తుఫాన్ జిల్లాలోని వ్యవసాయ పంటలతోపాటు ఉద్యాన పంటలకు సంబంధించి 5611. 33 హెక్టార్లలో నీట ముంచి రైతన్నలకు భారీ నష్టం మిగిల్చింది. వరుస వానలతో జిల్లాలో కొన్ని ప్రాంతాలు ప్రజలు నీలవ నీడ కూడా కోల్పోయారు.
ఉద్యాన పంటలకు సంబంధించి...
మోంథా తుపాన్ వల్ల జిల్లాలో 73 రైతు సేవా కేంద్రాల పరిధిలోని 2088 మంది రైతులకు సంబంధించి 1233.1 హెక్టార్లలో ఉల్లి, కూరగాయలు, పూల తోటలు దెబ్బతిన్నాయి. ఇందులో బి.మఠం మండలంలో 110 మంది రైతులు 70.2 హెక్టార్లలో, కలసపాడు మండలంలో 66 మంది రైతులకు సంబంధించిన 36.5 హెక్టార్లలో, పోరుమామిళ్ల మండలంలో 38 మంది రైతులకు సంబంధించి 20.4 హెక్టార్లలో, కాశినాయనలో 218 మంది రైతులకు సంబంధించి 140 హెక్టార్లలో, బి. కోడూరులో 24 మంది రైతులకు సంబంధించి 8 హెక్టార్లలో, సిద్దవటంలో 74 మంది రైతులకు సంబంధించి 74 హెక్టార్లలో, మైదుకూరు లో 871 మంది రైతులకు సంబంధించి 506 హెక్టార్లలో, దువ్వూరులో 639 మంది రైతులకు సంబంధించి 380 హెక్టార్లలో, ఖాజీపేటలో 41 మంది రైతులకు సంబంధించి 20 హెక్టార్లలో, వల్లూరులో 7 మంది రైతులకు సంబంధించి 4 హెక్టార్లలో ఉల్లి, కూరగాయల పంటలు, పూలతోటలు దెబ్బతిన్నట్లు ఉద్యాన అధి కారులు నష్టాన్ని అంచనాన్ని తయారు వేశారు.
వ్యవసాయ పంటలకు సంబంధించి..
జిల్లాలో 4378.23 హెక్టార్లలో వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో 1071 హెక్టార్లలో వరి, 68 హెక్టార్లలో కంది, 2559.24 హెక్టార్లలో మినుము, 119.5 హెక్టార్లలో పెసర, 145 హెక్టార్లలో మొక్కజొన్న, నాలుగు హెక్టార్లలో జొన్న, 71.64 హెక్టార్లలో వేరుశనగ, 284.5 హెక్టార్లలో పత్తి, 55.35 హెక్టార్లలో నువ్వలు పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ అధికారులు నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేశారు.
కూలిన నివాస గృహాలు...
వరుస వానలకు జిల్లాలో పలు మిద్దెలు కూలిపోయాయి. బి.మఠంలో వీరబ్రహేంద్రస్వామి వారి ఇళ్లు కూలిపోయింది. అలాగే ఖాజీపేట మండలం ముత్తలూరుపాడు, అప్పనపల్లె, శాంతినగర్ పలు ఇళ్లు నేలకూలాయి. కలసపాడు మండలం చెన్నుపల్లెకు చెందిన అన్నమ్మకు చెందిన కొట్టం కూలిపోయింది.
జిల్లా వ్యాప్తంగా వర్షాలు


