ఆకాంక్షిత లక్ష్యాలలో పురోగతి సాధించాలి
● భూగర్భ జలాల పెంపునకు చర్యలు
● నీతి అయోగ్ జాయింట్ సెక్రటరీ సిద్దార్థ జైన్
కడప సెవెన్‌రోడ్స్ : ఆకాంక్షిత జిల్లాల ప్రగతిలో వైఎస్సార్ కడప జిల్లా మరింత పురోగతి సాధించేందుకు సమిష్టి కృషితో ముందుకు వెళ్లాలని నీతి ఆయోగ్ సెక్రెటరీ జాయింట్ సెక్రటరీ సిద్ధార్థ జైన్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరితో కలిసి వైఎస్సార్ కడప ఆకాంక్షిత జిల్లా, ఆకాంక్షిత బ్లాక్ ప్రోగ్రాం ప్రగతిపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ సెక్రెటరీ మాట్లాడుతూ 2025 మార్చి నాటికి 73.6 స్కోరు సాధించి టాప్–5 జిల్లాలలో వైఎస్సార్ కడప జిల్లా నిలిచిందని తెలిపారు. పాఠశాలలు,అంగన్వాడీ కేంద్రాలలో శుద్ధమైన తాగునీరు అందించాలన్నారు. భూగర్భ జలాల పెంపునకు జిల్లా నీటి యాజమాన్య సంస్థ కు లక్ష్యాన్ని నిర్దేశించి లక్ష్యసాధనకు చర్యలు చేపట్టాలన్నారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ హెల్త్ అండ్ న్యూట్రిషన్, ఎడ్యుకేషన్ –నైపుణ్యాభివృద్ధి, గృహ నిర్మాణం, వ్యవసాయం, పశుపోషణ, మౌలిక సదుపాయాలు మొదలైన శాఖల్లో నిర్దేశిత లక్ష్యా లను సాధించడంలో మరింత పురోగతి సాధనకు కృషి చేస్తున్నామన్నారు. సీపీఓ హజరతయ్య, డీఈవో షంషుద్దీన్, డీఆర్‌డీఏ పీడీ రాజ్యలక్ష్మి ,హౌసింగ్ పీడీ రాజారత్నం పాల్గొన్నారు.
స్మార్ట్ కిచెన్ విధానం ఆదర్శనీయం
చింతకొమ్మదిన్నె : సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ నిర్వహణ అద్భుతంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం మరింత బాగుందని నీతిఆయోగ్ జాయింట్ సెక్రెటరీ, వైఎస్సార్ కడపజిల్లా ఆకాంక్షిత జిల్లా ప్రాబరీ అధికారి సిద్దార్థ్ జైన్ సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం జిల్లా కలెక్టర్‌తో కలిసి సీకే దిన్నె జెడ్పీ హైస్కూలులోని సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ ను ఆయన పరిశీలించారు. ఏడీపీ నోడల్ అధికారి జోయల్ విజయ్ కుమార్ పాల్గొన్నారు.
పీఏసీఎస్‌ల అభివృద్ధికి కృషి చేయాలి
కడప అగ్రికల్చర్ : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సిద్దార్థజైన్ పేర్కొన్నారు. బుధవారం డీసీసీ బ్యాంకులో సమావేశాన్ని నిర్వహించి పలు సూచనలు చేశా రు. డీసీసీబీ చైర్మెన్ తదితరులు పాల్గొన్నారు.


