●రూ.970 కోట్లను ఎగ్గొట్టి.. | - | Sakshi
Sakshi News home page

●రూ.970 కోట్లను ఎగ్గొట్టి..

Oct 27 2025 8:14 AM | Updated on Oct 27 2025 8:14 AM

●రూ.9

●రూ.970 కోట్లను ఎగ్గొట్టి..

●రూ.970 కోట్లను ఎగ్గొట్టి..

కడప కార్పొరేషన్‌: ఎంఎస్‌ఎంఈలపై కూటమి ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. మాటల్ని వల్లె వేస్తూ చిన్న పారిశ్రామికవేత్తల నోట్లో మట్టి కొడుతోంది. పరిశ్రమల ప్రోత్సాహకాలు అందిస్తున్నామని గొప్పగా చెబుతూనే నిధుల విడుదలలో మెలికలు పెడుతోంది. దీపావళి కానుకగా రూ.1500 కోట్లు తొలి విడతగా ప్రోత్సాహకాలు అందిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్భాటంగా ప్రకటించారు. ఈ ప్రోత్సాహకాలు అందరికీ కాదు...కొందరికే పడ్డాయని పారిశ్రామిక వేత్తలు వాపోతున్నారు. తమకు ప్రోత్సహకాలు పడతాయా....పడవా...పడకపోతే తమ పరిస్థితి ఏంటని చాలా మంది అధికారులను ఆరా తీస్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఏ ప్రాతిపదికన ఎవరికి ప్రోత్సాహకాలు ఇస్తుందో పరిశ్రమల శాఖ అధికారులకు కూడా తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ‘ఎంఎస్‌ఎంఈలను ఆదుకుంటాం...రూ.5వేల కోట్లు బకాయిలన్నీ పూర్తిగా చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని, ఎంఎస్‌ఎంఈలకు అధిక ప్రాధాన్యత ఇస్తా’మని మంత్రులు, అధికారులు ఇన్నాళ్లు చెబుతూ వచ్చారు. తీరా ప్రోత్సాహకాల విడుదలకు దగ్గరికి వచ్చేసరికి ఎంఎస్‌ఎంఈలకు ఎంగిలి మెతుకులు విదిల్చి భారీ పరిశ్రమలపై మమకారం కనబరిచారని విమర్శలు వినిపిస్తున్నాయి.

● రాష్ట్ర వ్యాప్తంగా 15,822 యూనిట్లకు రూ.1916. 74కోట్లు ప్రోత్సాహకాలు రావాల్సి ఉంది. చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహకాల రూపంలో సకాలంలో సాయమందిస్తే అవి నిలదొక్కుకునే అవకాశం కలుగుతుంది. ఎక్కువమందికి ప్రయోజనం చేకూరుతుంది కూడా. అభివృద్ధిని కాంక్షించే ఏ ప్రభుత్వమైనా ఎంఎస్‌ఎంఈలకే ఎక్కువ నిధులు కేటాయిస్తుంది, కానీ కూటమి ప్రభుత్వం అందుకు విరుద్ధంగా కేవలం 2538 యూనిట్లే అర్హత సాధించినట్లు పేర్కొంటూ అతితక్కువగా రూ. 275.47కోట్లు మాత్రమే విడుదల చేసింది. అలాగే భారీ, మెగా పరిశ్రమల్లో 182 యూనిట్లకు రూ. 694.44కోట్లు అత్యధికంగా విడుదల చేయడం గమనార్హం. దీనిద్వారా ఎంఎస్‌ఎంఈల కంటే తమ ప్రభుత్వానికి బడా పారిశ్రామిక వేత్తలు, కార్పొరేట్‌ శక్తుల ప్రయోజనాలే ముఖ్యమని చెప్పకనే చెప్పినట్లయ్యిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఎస్టీ, ఎస్టీల రాయితీల్లో భారీగా కోత

ఎస్సీ, ఎస్టీలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామంటూ ప్రగల్భాలు పలికే ప్రభుత్వాలు ఆచరణలో వారికి చేసేది శూన్యమని మరోసారి నిరూపితమయ్యింది. భారీ పరిశ్రమలకు ఎక్కువగా ప్రోత్సాహకాలు అందించిన ప్రభుత్వం, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, ముఖ్యంగా ఎస్సీ,ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు రాయితీల్లో భారీగా కోత కోసినట్లు సమాచారం. ఇతర సామాజిక వర్గాలతో పోల్చితే ఎస్సీ, ఎస్టీలకు ఆర్థిక స్తోమత అంతంత మాత్రంగానే ఉంటుంది. ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుందన్న నమ్మకంతో జీవితాంతం కూడబెట్టుకున్న సంపాదనను, అప్పులు సప్పులు చేసిన తెచ్చిన మొత్తాన్నంతా పరిశ్రమల్లో పెట్టి అవి సక్రమంగా నడవక ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకులకు ఈఎంఐలు సకాలంలో చెల్లించలేక నానా అవస్థలు పడుతున్నారు. కొంతమందైతే యూనిట్లు ప్రారంభించిన కొద్ది నెలలకే మూతేసుకున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం మానవత్వం వ్యవహరించి దరఖాస్తు చేసుకున్న అందరికీ 100 శాతం ప్రోత్సాహకాలు అందించాలని పలుసార్లు ప్రభుత్వానికి విన్నవించారు. ఇటీవల విజయవాడలో ఆందోళన కూడా నిర్వహించారు. తమకు వ్యతిరేకంగా గళమెత్తారన్న అక్కసుతోనే ప్రోత్సాహకాల విడుదలలో ఎస్సీ, ఎస్టీలకు భారీగా కోత విధించినట్లు పారిశ్రామిక వేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అతి కొద్దిమందికి మాత్రమే ప్రోత్సాహకాలు 20 శాతం మాత్రమే జమ అయ్యాయని తెలుస్తోంది.

పారిశ్రామిక ప్రోత్సాహకాల విడుదలలో కూటమి ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని పారిశ్రామిక వేత్తలు మండిపడుతున్నారు. ఏ ఏడాది ప్రోత్సాహకాలు అదే ఏడాది ఇచ్చేస్తాం...ఇందుకోసం ప్రత్యేకంగా ఎస్క్రో అకౌంట్‌ తెరిచి మరీ బకాయిలు లేకుండా చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం... ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని వారు అంటున్నారు. పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం ప్రభుత్వం బ్యాంకుల నుంచి రూ.2000కోట్లు రుణం తీసుకుంది. ఇందులో కేవలం రూ.1500 కోట్లు ప్రోత్సాహకాల కోసం విడుదల చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. మిగతా రూ.500కోట్లు కోత కోశారు. ఇస్తామని ప్రకటించిన రూ.1500 కోట్లలో కూడా విడుదల చేసింది కేవలం రూ.1030 కోట్లేనని... ఇందులో కూడా రూ.470 కోట్లు కోత విధించారని చెబుతున్నారు. మొత్తంగా రూ.970 కోట్లు ప్రోత్సాహకాలు ఇవ్వకుండా ఎగ్గొట్టారని తెలుస్తోంది. బస్సులకు సంబంధించి 306 యూనిట్లకు రూ.56కోట్లు మాత్రమే విడుదల చేసింది.

వైఎస్సార్‌ కడప జిల్లాకు సంబంధించి 1935 యూనిట్లకు 150.71 కోట్లు ప్రోత్సాహకాలు రావాల్సి ఉంది. ఇందులో బస్సులు, ఇతర వాహనాలు అన్నీ ఉన్నాయి. అయితే కొందరికి 40 శాతం, మరికొందరికి 20 శాతం ప్రోత్సాహకాలు ఖాతాల్లో జమ అయినట్లు తెలుస్తోంది. చాలామందికి అసలే పడలేదని సమాచారం.

●రూ.970 కోట్లను ఎగ్గొట్టి.. 1
1/2

●రూ.970 కోట్లను ఎగ్గొట్టి..

●రూ.970 కోట్లను ఎగ్గొట్టి.. 2
2/2

●రూ.970 కోట్లను ఎగ్గొట్టి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement