మోంథాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి
తుపానుపై ఆందోళన వద్దు
కడ సెవెన్‌రోడ్స్: మోంథా‘తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో ఈ నెల 27,28వ తేదీలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, దీనిని ఎదుర్కొనేందుకు అధికారులు పూర్తి సన్నద్ధంగా ఉండాలని ఇన్‌ఛార్జి కలెక్టర్ అదితి సింగ్ అధికారులను ఆదేశించారు. తుపాన్‌ను ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న చర్యలపై ఆదివారం అదితిసింగ్ జిల్లా అధికారులు, ఆర్డీవోలు, మండల అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తుఫాన్ నేపద్యంలో అధికారులందరూ అప్రమత్తంగా ఉంటూ విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలన్నారు. తుపాన్ ప్రభావం వల్ల జిల్లాలో ఎక్కడా కూడా ప్రాణ నష్టం, పశు నష్టం, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మండలాల ప్రత్యేక అధికారులు మండల స్థాయి లోని అధికారులను సమన్వయం చేసుకొని లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. పునరావాస కేంద్రాలలో అవసరమైన అన్ని చర్యలు చేపట్టే విషయంలో ఆర్డీఓ పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలన్నారు. గుర్తించిన పునవాస కేంద్రాలలో మౌలిక వసతులు, త్రాగు నీరు,ఆహార సరఫరా, విద్యుత్,వైద్య సేవలు అందించాలన్నారు. ప్రమాదకర స్థాయిలో వాగులు,వంకలు పొంగే ప్రాంతాల వైపు ప్రజలు వెళ్ల కుండా సిబ్బంది ముందస్తు చర్యలు తీసుకోవాలనన్నారు. వైద్య ఆరోగ్య శాఖాధికారులు, సిబ్బంది 24 గంటలు వైద్య సేవలు అందించేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలనన్నారు. భారీ వర్షాల వల్ల అన్ని గ్రామాల్లో మంచినీరు, పారిశుధ్యంపై జిల్లా పంచాయతీ అధికారి, మున్సిపాలిటీల్లో మున్సిపల్ కమీషనర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పంటలను కాపాడుకునే చర్యలతో పాటు.. చేతికందిన పంట దాన్యాన్ని గోడౌన్లలో భద్రపరుచుకోవాలన్నారు. అత్యవసర సహాయ చర్యలను అందించేందుకు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంతో పాటు కడప, జమ్మలమడుగు, బద్వేలు, పులివెందుల ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశామని వెల్లడించారు.
27,28వ తేదీల్లో భారీ వర్షాలకు అవకాశం!
పునరావాస కేంద్రాలకు లోతట్టు ప్రజలు
ఇన్‌చార్జి కలెక్టర్ అదితిసింగ్
కడప సెవెన్‌రోడ్స్: మోంథా తుఫాను నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన సహాయక చర్యలు అందించేందుకు అప్రమత్తంగా ఉందని.. భయభ్రాంతులను చేసే పుకార్లను నమ్మకుండా.. ప్రశాంతంగా ఉండాలని ఇన్‌చార్జి కలెక్టర్ అదితి సింగ్ ప్రజలకు సూచించారు. ప్రభుత్వం నిర్వహణలో 24/7 పనిచేసే టోల్ ఫ్రీ నెంబర్లు : 112, 1070, 1800 425 0101 లకు కాల్ చేయవచ్చని ఇంచార్జి కలెక్టర్ తెలిపారు.


