మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదు
కడప అగ్రికల్చర్: జిల్లాలోని మత్య్సకారులు నదులు, జలశయాలలోకి చేపల వేటకు వెళ్లరాదని జిల్లా మత్స్యశాఖ ఉప సంచాలకులు నాగయ్య తెలిపారు. అంతేకాకుండా మత్స్యకారులు తమకు సంబంధించిన వలలు, పుట్టీలు, ఇతర సామగ్రి సురక్షిత ప్రాంతాలలో ఉంచుకోవాలని సూచించారు. పరిసర ప్రాంతాల్లో వరద ఆపద సమయంలో ఉన్నప్పుడు రెవెన్యూ, పోలీసు శాఖ ఇతర ఏశాఖవారు పిలిచినా వారికి అందుబాటులో ఉండాలని సూచించారు.
కడప అగ్రికల్చర్: జిల్లాలో రబీ సీజన్‌కు సంబంధించి సబ్సిడీ బుడ్డ శనగ విత్తనాల కోసం రిజిస్ట్రేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. తొలి రోజు ఆదివారం జిల్లావ్యాప్తంగా 14 మండలాల పరిధిలోని 95 రైతు సేవా కేంద్రాలలో 5801 మంది రైతులు శనగ విత్తనాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ నెల28వ తేదీతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిపేస్తారు. అనంతరం రైతులకు విత్తన పంపిణీ చేస్తారు. రైతులు ఈ అవకాశం వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
కొండాపురం: గండికోట ప్రాజెక్టు నుంచి రెండు క్రస్ట్ గేట్లు ద్వారా 5 వేల క్యూసెక్కులనీటిని మైలవరం జలాశయానికి విడుదల చేశామని జీఎన్‌ఎస్‌ఎస్‌ఈఈ ఉమా మహేశ్వర్లు ఆదివారం తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి వరదనీరు రావడంతో ఆవుకు రిజర్వాయర్ నుంచి 3 వేల క్యూసెక్కుల నీరు గండికోట ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో ఉందన్నారు. అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం లోని చాగల్ల రిజర్వాయర్ నుంచి వేయ్యి క్యూసెక్కులనీటిని పెన్నానదికి వదలడంతో గండికోట జలాశయంలోకి రాత్రి వచ్చి చేరుతాయన్నారు. ప్రస్తు తం గండికోట జలాశయం పూర్తినీటిసామర్థ్యం 26.85 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 26.3 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. ఈ నేపథ్యంలో 5 వేల క్యూసెక్కులనీటిని ఆదివారం సాయంత్రం దిగువకు వదిలినట్లు వెల్లడించారు.
మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదు


