● భారీ వర్షాల సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు | - | Sakshi
Sakshi News home page

● భారీ వర్షాల సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు

Oct 27 2025 8:14 AM | Updated on Oct 27 2025 8:14 AM

● భారీ వర్షాల సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు

● భారీ వర్షాల సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు

● భారీ వర్షాల సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు

మోంథా తుపాన్‌ వల్ల ఈ నెల 27, 28, 29 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

● అత్యవసరమైతే తప్పా బయటకు వెళ్లకండి.

● నీటితో నిండిన రహదారులు, వంతెనలు దాటేందుకు ప్రయత్నించవద్దు.

● విద్యుత్‌ తీగలు, పోల్‌లు తాకరాదు, వాటికి దగ్గరగా కూడా వెళ్లవద్దు.

● ఇళ్ల చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజ్‌ సదుపాయాలను శుభ్రం చేసుకోండి.

● చిన్న పిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లకుండా జాగ్రత్తపడండి.

● నదులు, వాగులు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున తీర ప్రాంతాల వద్దకు వెళ్లకండి.

● వరద నీరు ఇళ్లలోకి చేరే అవకాశం ఉంటే, ముందుగానే సురక్షిత ప్రదేశాలకు తరలించండి.

● పశువులను ఎత్తైన ప్రదేశాలకు తరలించండి.

● పిడుగు సమయంలో చెట్ల కింద లేదా ఓపెన్‌ ప్రదేశాల్లో నిలబడి ఉండవద్దు.

● మొబైల్‌ ఫోన్‌, ల్యాప్‌టాప్‌, టీవీ వంటి ఎలక్ట్రానిక్‌ పరికరాల వినియోగాన్ని ఆపండి.

● పిడుగు సమయంలో నీటిలో ఉండవద్దు చేపలు పట్టడం లేదా స్నానం చేయడం మానుకోండి.

● ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక శాఖ అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించవలసిందిగా కోరడమైనది.

● భారీవర్షాలకు సంబంధించి ఏదైనా అవాంఛనీయ సంఘటనలు ఎదురైతే ఈ క్రింద తెలిపిన కంట్రోల్‌ రూమ్‌ నంబర్లకు లేదా డయల్‌ 112 కు గాని ఫోన్‌ ద్వారా తెలియ జేయాలని జిల్లా ఇంచార్జి కలెక్టర్‌ సూచించారు.

● జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయం, కడప కంట్రోల్‌ రూమ్‌ :08562 – 246344

● ఆర్డీవో కార్యాలయం,కడప: 08562– 295990

● ఆర్డీవో కార్యాలయం, జమ్మలమడుగు : 95028 36762

● ఆర్డీవో కార్యాలయం, బద్వేలు : 6301432849

● ఆర్డీవో కార్యాలయం, పులివెందుల : 8919134718

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement