ముంచుకొస్తున్న మోంథా!
కడప అగ్రికల్చర్: జిల్లాకు మోంథా రూపంలో తుపాను గండం పొంచి ఉంది. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాలో నాలుగు రోజుల పాటు వర్షాలు ముంచెత్తాయి. చాలా వరకు పంటలు ఇంకా నీటిలోనే ఉన్నా యి. వరుస వానలతో జిల్లావ్యాప్తంగా 8682 ఎకరాల్లో వరి, పత్తి, వేరుశనగ, మొక్కజొన్న, మినుము పంటలు దెబ్బతిని రైతుల పెట్టుబడులు వర్షార్పణం అయ్యాయి. దీంతో రైతుల కష్టం నీళ్లపాలై లక్షల మేర నష్టం వాటిల్లింది. శని, ఆదివారాలు వర్షాలకు కాసింత తెరపి రావడంతో ఉపశనమం కలిగిందని సంతోషించే లోపే మళ్లీ సోమవారం నుంచి మోంథా తుపాన్ ఉందని అధికారులు ప్రకటించడంతో అన్నదాతల్లో గుబులు మొదలైంది. ఇప్పటికే జిల్లా అధికారులు పజల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలకు రెండు రోజుల పాటు సెలవులను కూడా ప్రకటించారు. అలాగే అత్యవసర సహాయ చర్యల కోసం కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసి ఫోన్ నెంబర్లను కూడా ప్రకటించారు. వాతావరణ శాఖ ఈ నెల 27,28 తేదీలలో జిల్లాకు రెడ్ అలెర్ట్‌ను జారీ చేసింది. శని, ఆదివారాల్లో కేవీకేకు చెందిన శాస్త్రవేత్తలు గ్రామాల్లో పర్యటించి రైతులకు తగిన సూచ నలు చేశారు. వర్షం నుంచి పంటలను ఏవిధంగా కాపాడుకోవాలో సలహాలు అందించారు.
ఇప్పటికే జిల్లాను ముంచెత్తిన వర్షాలు
తాజాగా మోంథా రూపంలోతుపాను గండం
వేలాది ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు
అప్రమత్తంగా ఉండాలంటున్న జిల్లా అధికార యంత్రాంగం
ఆందోళనలో జిల్లా రైతులు, ప్రజలు
ముంచుకొస్తున్న మోంథా!


