
డబ్బు ఇవ్వలేదని తిప్పుతున్నారు..
1250–4 సర్వే నంబర్‌లో నాకు 1.06 సెంట్ల స్థలం ఉంది. 1987లో నాకు ప్రభుత్వం భూమిని కేటాయించింది. అప్పటి నుంచి నేను సాగు చేసుకుంటున్నాను. 2017లో నా భూమిని వివాదాస్పద భూమిగా ఆన్‌లైన్‌లో అధికారులు నమోదు చేశారు. ఈ భూమిపై కోర్టుకు వెళితే నాకు అనుకూలంగా వచ్చింది. దీనికి సంబంధించి అన్ని పత్రాలను జాయింట్ కలెక్టర్‌కు చూపించాను. వెంటనే నా భూమి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. నెల రోజుల నుంచి ఖాజీపేట తహసీల్దార్ కార్యాలయంలో ఆర్‌ఐ దగ్గరకు తిరుగుతున్నా ఎలాంటి రిపోర్టు రాయడం లేదు. పని కావాలంటే డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఇవ్వలేదని తిప్పుతున్నారు. నెల రోజులుగా తిరుగుతున్నా అధికారులు పలకడం లేదు. ఆన్‌లైన్ చేయడం లేదు. తవ్వా సుబ్బారెడ్డి, ఖాజీపేట