
ప్రత్యక్ష రాజకీయాల్లోకి చవ్వా దుష్యంత్‌రెడ్డి
పులివెందుల: ప్రముఖ పారిశ్రామికవేత్త చవ్వా దుష్యంత్‌రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నట్లు ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ప్రకటించారు. దుష్యంత్‌రెడ్డి గతంలో కమలాపురం, జమ్మలమడుగు ప్రాంతాల్లో ఎన్నికల ఇన్‌చార్జిగా పనిచేశారు. గురువారం పులివెందులలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ పులివెందుల మున్సిపాలిటీకి సంబంధించి గత 30ఏళ్లుగా వైఎస్ మనోహర్‌రెడ్డి సేవలు అందించారని, ప్రస్తుతం ఆయన వయస్సు రీత్యా దుష్యంత్‌రెడ్డి మనోహర్‌రెడ్డికి తోడుగా పులివెందుల మున్సిపాలిటీలో సేవలందిస్తారన్నారు. పులివెందుల మున్సిపాలిటీ ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని తెలిపారు.