సాక్షి ప్రతినిధి, కడప: కడప తెలుగుదేశం పార్టీలో అసమ్మతి మంటలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డికి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. ఎమ్మెల్యే దంపతుల ఒంటెత్తు పోకడలతో టీడీపీ నేతలు, కార్యకర్తలు క్రమం తప్పకుండా తిరుగుబావుటా ఎగురువేస్తున్నారు. ఇటీవల ‘సీనియర్లు లేరు...తొక్కా లేద’న్న జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి వ్యాఖ్యలపై తెలుగుతమ్ముళ్లు మండిపడుతున్నారు. మొన్న దేవుని కడప వేదికగా ఎమ్మెల్యే దంపతులకు మంచి బుద్ధులు ప్రసాదించాలని నిరసన తెలిపిన తెలుగుతమ్ముళ్లు, తాజాగా పెద్ద దర్గా వేదికగా మరోమారు ఆరోపణలు గుప్పించారు. కడప అసమ్మతి నేతలకు కమలాపురం టీడీపీ నేత పుత్తా నరసింహారెడ్డి గాడ్ ఫాదర్‌గా నిలుస్తుండడంతో అధికార పార్టీకి చెందిన కడప, కమలాపురం నేతల మధ్య విభేదాల మంటలు రగిలిపోతున్నాయి.
● కడపలో ఇరవై ఏళ్ల సుధీర్ఘ విరామం తర్వాత టీడీపీ జెండా ఎగిరింది. ఈ గెలుపు వెనుక అనేక మంది కార్యకర్తల శ్రమ లేకపోలేదు. దీన్ని విస్మరించిన మాధవిరెడ్డి, వాసు దంపతులు తమ ఒక్కరిదే విజయమన్నట్లు.. ఒంటెద్దు పోకడలు పోతున్నారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. దీంతో ఏడాది తిరక్కముందే వారి తీరుపై తీవ్రమైన అసంతృప్తులు వ్యక్తమవుతూ వచ్చాయి. ఈక్రమంలో మొన్న దేవుని కడప వేదికగా ఎమ్మెల్యే మాధవీరెడ్డి దంపతులకు మంచి బుద్ధులు ప్రసాదించాలని పాతకడప సింగిల్‌విండో అధ్యక్షుడు కృష్ణారెడ్డి, చెన్నంశెట్టి మురళికృష్ణ, దేవుని కడప శంకర్ తదతరుల నాయకత్వంలో శ్రీవేంకటేశ్వరస్వామికి విన్నవించారు. ఆపై కమలాపురం టీడీపీ నేత పుత్తా నరసింహారెడ్డి చెంతకు చేరి అండగా నిలవాలని కోరారు. అదే తరహాలో ముస్లిం మైనార్టీ నేతలు కూడా తెరపైకి వచ్చారు. సీనియర్లు లేరు...తోలు లేదు..తొక్కా లేదంటూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. పెద్దదర్గాలో ప్రార్ధనలు అనంతరం పార్టీ కోసం ఎంతో శ్రమించిన వారిని కాదనీ, వారికి నచ్చిన వారికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆపై కమలాపురం టీడీపీ నేత పుత్తా ఇంటికి చేరుకొని అండగా నిలవాలంటూ అభ్యర్థించారు. త్వరలో మరి కొంతమంది క్రిస్టియన్ మైనార్టీలు సైతం మరియాపురం చర్చి నుంచి కూడా ఇలాగే బయలుదేరి వెళ్లి పుత్తాను కలవనున్నట్లు తెలుస్తోంది.
అధ్యక్ష పదవికి ఎసరు పెట్టే
దిశగా అడుగులు...
టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి పదవికి ఎసరు పెట్టే దిశగా జిల్లా టీడీపీ నేతల అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. కడప గడపలో ఎమ్మెల్యే దంపతుల పట్ల వ్యతిరేకత బూచిగా చూపిస్తూనే, పొలిట్‌బ్యూరో మెంబర్‌గా, జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాసులరెడికి రెండు పదవులు ఉండడం, ఇతర నియోజకవర్గాల నాయకులతో సన్నిహిత సంబంధాలు తెగిపోవడం కూడా కారణాలుగా చెబుతోన్నట్లు తెలుస్తోంది. ఈనేపధ్యంలో జిల్లా అధ్యక్షడు మార్పు చేయాలంటూ తెరవెనుక మంత్రాంగం నడుస్తోన్నట్లు సమాచారం. ఆ మేరకు మధ్యేమార్గంగా జమ్మలమడుగు ఇన్‌ఛార్జీ భూపేష్‌రెడ్డికి కట్టబెట్టాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ, సీనియర్ నేతగా గుర్తింపు ఉన్న పుత్తా నరసింహారెడ్డికి అప్పగించాలనే డిమాండ్ తెరపైకి తెస్తున్నట్లు సమాచారం. ఆ మేరకు కడప నేతలతో వ్యూహాత్మక అడుగులు వేయిస్తున్నట్లు పరిశీలకులు వెల్లడిస్తున్నారు.
సీనియర్లు లేదు... తొక్క లేదు... వాసు మాటలపై మండిపాటు
మొన్న దేవుని కడప వేదికగా తెలుగుతమ్ముళ్లు ఆరోపణలు
నేడు పెద్దదర్గాలో ముస్లిం మైనార్టీ నాయకులు నిలదీత
అసమ్మతి నేతల్ని చేరదీస్తున్న కమలాపురం నేత పుత్తా నరసింహ రెడ్డి
కడప, కమలాపురం ఎమ్మెల్యేల మధ్య రగులుతున్న మంటలు
కడప, కమలాపురం ఎమ్మెల్యే మధ్య తీవ్రమైన వైరం నడుస్తోంది. జిల్లా కేంద్రానికి ప్రాతినిథ్యం వహిస్తున్నాం, మా ఆధిపత్యమే ఉండాలంటూ కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి పట్టుబడుతోంది. బ్రౌన్ లైబ్రరీ శిలాఫలకంలో కమలాపురం ఎమ్మెల్యే పేరు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. బిల్టప్ సమీపంలో పుత్తా వర్గీయులు మద్యంషాపు పెట్టుకోవడాన్ని కూడా వ్యతిరేకించారు. మౌర్య వైన్స్ మద్యం షాపుకు బాడుగకు ఇచ్చిన ఇంటికి కార్పొరేషన్ పర్మిషన్ లేదంటూ అధికారులను ఉసిగొల్పి చర్యలకు ఉపక్రమించారు. ఈపరిణామాన్ని టీడీపీ సీనియర్ నేత పుత్తా నరసింహారెడ్డి సీరియస్‌గా తీసుకున్నారు. కార్పోరేషన్ అధికారుల్ని నిర్భంధించి మిమ్మల్ని పంపించన నాయకునికి చెప్పుకొండంటూ పరుష పదజాలంతో హెచ్చరికలు చేశారు. మరోవైపు పుత్తా ఎస్టేట్ డ్రైనేజీ కాలువ ఆక్రమణలకు పాల్పడ్డారంటూ కడప ఎమ్మెల్యే ఏకంగా ఆరోపణలు గుప్పించారు. ఈ పరిణామాల నేపధ్యంలోనే కడప అసంతృప్తి నేతలకు అండగా పుత్తా నరసింహారెడ్డి నిలుస్తున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. కడప సీనియర్ నేత ఆలంఖాన్‌పల్లె లక్ష్మిరెడ్డితో పుత్తా పూర్తి సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. నగర మాజీ అధ్యక్షుడు శివకొండారెడ్డిపై దాడి చేస్తే పుత్తా నరసింహారెడ్డి పరామర్శించారు. పాతకడప కృష్ణారెడ్డి అండ్ టీమ్‌కు అండగా నిలిచారు. తాజాగా ముస్లీం మైనార్టీ నేతలకు భరోసా ఇచ్చారు. ఇటీవల కోటిరెడ్డి సర్కిల్ బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటును ఎమ్మెల్యే వర్గీయులు అడ్డుకుంటే పుత్తా వర్గీయులు అండగా నిలిచారు.
● కడప, కమలాపురం ఎమ్మెల్యేల మధ్య తీవ్రమైన వైరం
● కడప, కమలాపురం ఎమ్మెల్యేల మధ్య తీవ్రమైన వైరం
● కడప, కమలాపురం ఎమ్మెల్యేల మధ్య తీవ్రమైన వైరం
● కడప, కమలాపురం ఎమ్మెల్యేల మధ్య తీవ్రమైన వైరం
● కడప, కమలాపురం ఎమ్మెల్యేల మధ్య తీవ్రమైన వైరం
● కడప, కమలాపురం ఎమ్మెల్యేల మధ్య తీవ్రమైన వైరం