
విజేతలకు బహుమతులు పంపిణీ
ప్రొద్దుటూరు : స్థానిక అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో గురువారం జిల్లా నెహ్రూ యువ కేంద్రం, వికసిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి వాలీబాల్, కబడ్డీ పోటీలు మహిళలు, పురుషులకు నిర్వహించారు. ఈ సందర్భంగా టూటౌన్ సీఐ సదాశివయ్య మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. అనంతరం వాలీబాల్ విజేతలకు ప్రథమ బహుమతి రూ.10వేలు ప్రొద్దుటూరు టౌన్ వారికి, ద్వితీయ బహుమతి రూ.7వేలు ఆర్‌సీపీఈకి, కబడ్డీలో మొదటి బహుమతి రాయలసీమ వ్యాయామ విద్య కళాశాల జట్టుకు రూ.10వేలు, కమలాపురం ఎస్‌ఎస్‌ఆర్ కాలేజీ విద్యార్థులకు ద్వితీయ బహుమతి రూ.7వేలు, ట్రోఫీతోపాటు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వికసిత ఫౌండేషన్ అధ్యక్షురాలు శూలం లక్ష్మీదేవి, హరిత రెడ్డి, వెంకట్ యాదవ్, ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఈసీ మెంబర్ డాక్టర్ వరుణ్‌కుమార్‌రెడ్డి, వేములపాటి సూర్యనారాయణరెడ్డి, గల్ఫ్ మహిళా సేవా సమితి కువైట్ వారు పాల్గొన్నారు.