
సేవ చేయడమే పరమ ధర్మం
కడప ఎడ్యుకేషన్ : ’పరుల సేవ చేయడమే పరమ ధర్మము.. పరుల బాధను అర్థం చేసుకున్న వాడే పరమ భక్తుడు’ అన్న వేమన మాటలు మనందరికీ స్ఫూర్తి మంత్రాలు. ఆయన ఆదర్శ భావజాలం యోగివేమన విశ్వవిద్యాలయంలో ఉన్న మనందరి మనసులలో ఇమిడిపోవాలని యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ ఉద్ఘాటించారు.
యోగి వేమన విశ్వవిద్యాలయం ఎన్‌ఎస్‌ఎస్ ద్వారా సమాజానికి విస్త్తృత సేవలు అందించిన కళాశాలలు, ప్రోగ్రాం ఆఫీసర్లు, వలంటీర్లకు యోగివేమన విశ్వవిద్యాలయ జాతీయ సేవా పథకం –2025 అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని అన్నమాచార్య సెనేట్ హాలులో గురువారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి సేవ జీవితంలో భాగం కావాలన్నారు. గ్రామీణ ప్రజలను ప్రభుత్వ పథకాలు, ఆరోగ్యం, విద్య, మూఢనమ్మకాలు వంటి అంశాలపై నిత్యం చైతన్యం చేయాలని సూచించారు. ఇన్‌చార్జి రిజిస్ట్రార్ పుత్తా పద్మ, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ టి. శ్రీనివాస్, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్.వెంకట్రామిరెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పీఓలు, వలంటీర్లు పాల్గొన్నారు.
అవార్డులు అందుకున్నది వీరే..
ఉత్తమ వలంటీర్లు డి.శ్రావణి (ప్రభుత్వ డిగ్రీ కళాశాల రాజంపేట), డి. సిద్ధయ్య, (ఎస్.బి.ఎస్‌వైఎం డిగ్రీ కళాశాల, మైదుకూరు), కేబీ ఈశ్వర్( వైవీయూ కాలేజ్), కె. శ్రీనివాసులు రెడ్డి (వైవీయూ పీజీ కళాశాల).
ఉత్తమ ప్రోగ్రామ్ ఆఫీసర్లుగా..
డాక్టర్ కె. గోవింద రెడ్డి, (ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, కడప), డాక్టర్ యు.సునీత, (ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, పులివెందుల), సి. మల్లేశ్వరమ్మ, (వైఎస్‌ఆర్‌వి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, వేంపల్లి,), డాక్టర్ ఎ.నాగరాజు, (ప్రభుత్వ పురుషుల కళాశాల (ఎ), కడప), డాక్టర్ పత్తి వెంకట కృష్ణా రెడ్డి, (ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మైదుకూరు), డాక్టర్ ఎస్.సునీత, (యోగి వేమన విశ్వవిద్యాలయ కళాశాల, కడప), డాక్టర్ ఎస్.పి. వెంకట రమణ, (యోగి వేమన విశ్వవిద్యాలయ కళాశాల, కడప).
ఉత్తమ కళాశాలలుగా..
సి. సూర్యారావు, (ప్రిన్సిపల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల కడప ), డాక్టర్ పి. నారాయణ రెడ్డి, (ప్రిన్సిపల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మైదుకూరు,), ప్రొఫెసర్ టి.శ్రీనివాస్, (ప్రిన్సిపల్ యోగి వేమన యూనివర్సిటీ కాలేజ్,).
వైవీయూ వీసీ ఆచార్య
బెల్లంకొండ రాజశేఖర్