
ప్రయాణికులకు ఇబ్బంది కలిగించవద్దు
కడప కోటిరెడ్డిసర్కిల్ : ఏపీఎస్సార్టీసీ కడప జోన్ పరిధిలో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలని ఏపీఎస్ ఆర్టీసీ కడప జోన్ జోనల్ చైర్మన్ పూల నాగరాజు సూచించారు. కడప నగరం లోని తన కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ తాగునీరు, కుర్చీలు, ఫ్యాన్లు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించామన్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, జోన్ వ్యాప్తంగా 1.82 కోట్ల మంది ప్రయాణించారన్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం 15 ఏళ్లు పైబడిన బస్సులను తొలగించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. కడప జోన్‌కు 500–600 బస్సులు అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఈడీ పైడి చంద్రశేఖర్, ఆర్‌ఎం పొలిమేర గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.