
డ్రాగా ముగిసిన మల్టీ డే మ్యాచ్‌లు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ఏసీఏ సౌత్ జోన్ అండర్–23 మల్టీడే మ్యాచ్‌లు బుధవారం డ్రాగా ముగిశాయి. కేఎస్‌ఆర్‌ఎం క్రికెట్ మైదానంలో కర్నూలు–చిత్తూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది. కర్నూలు జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ప్రారంభించాల్సి ఉండగా వర్షం కారణంగా రద్దు చేశారు.
వైఎస్సార్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో....
వైఎస్సార్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్‌లో 109 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కడప జట్టు 46 ఓవర్లకు 203 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని విజయ్ రామిరెడ్డి 86, ఎస్‌ఎండి.ఆయూబ్ 42 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని మల్లిఖార్జున నాలుగు, షేక్ కమిల్ మూడు వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన అనంతపురం జట్టు 5.3 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 26 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. అనంతపురం జట్టు తొలి ఇన్నింగ్స్ అధిక్యం సాధించింది. దీంతో మల్టీ డే మ్యాచ్‌లో నెల్లూరుకు–19, చిత్తూరుకు 11, కర్నూలుకు ఆరు, కడపకు ఐదు, అనంతపురానికి నాలుగు పాయింట్లు లభించాయి.
ఎస్‌జీఎఫ్ క్రీడలకు 300 మంది హాజరు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడలకు బుధవారం 300 మంది ఉమ్మడి జిల్లా క్రీడాకారులు హాజరైనట్లు ఎస్‌జీఎఫ్ సెక్రటరీలు శ్రీకాంత్‌రెడ్డి, చంద్రావతి పేర్కొన్నారు. నగరంలోని డాక్టర్ వైఎస్సార్ క్రీడా పాఠశాలలో అండర్–14, 17 వయస్సు విభాగాలకు పుట్‌బాల్, బాక్సింగ్, రగ్బీ, మోడరన్ పెంటతలాన్ క్రీడలకు జిల్లా జట్టు ఎంపికలను చేపట్టారు. పోటీలలో ప్రతిభ కనపరిచిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. వారి వివరాలిలా ఉన్నాయి.
అండర్–14 బాలురు : శ్రావణ్‌కుమార్‌రెడ్డి, ఇర్ఫాన్, నిషాంత్‌రాజు, గురుతేజేశ్వర్, వెంకట ప్రణీత్, లెనిన్, గోపీనాథ్, నాగచరణ్, కెవి.ప్రణీశ్వర్, ఆదిత్, శ్రీనివాస్, అఖిల్, భరత్, నాగ చైతన్య, భద్ర, విగ్నేష్ కార్తీయన్, అభిరామ్ సాయివర్మ, మహ్మద్ హుస్సేన్, ధనుష్ సాయికుమార్.
అండర్–17 బాలురు : సాయిరాకేష్, మహేష్‌బాబు, మస్తాన్‌వల్లి, జీవన్‌కుమార్, హామీద్, చరణ్, కార్తిక్, మహ్మద్ సుభాన్, జితేంద్ర, రెడ్డిచౌదరి, హేమంత్ కుమార్, ధీరజ్, రేవన్, వెంకట మణిరాజ్, సమీర్, చవనీశ్వర్, కెవిన్ భగవత్, మణికంఠ. బాలికలు : లక్ష్మీదేవి, జ్యోత్న, హర్షిత, అఖిల, హిమవర్షిణి, నీనగ్న, లక్ష్మీ తులసి, హిమ ప్రియ, అనుష, స్వప్న, ప్రహర్షిత, స్రవంతి, ఐశ్వర్య, జాహ్నవి, అర్చన, అమృత వర్షిణి, గౌతమి.