
జిల్లాలో వర్షం
చాపాడులో 80.2 మిల్లీమీటర్ల వర్షం
కడప అగ్రికల్చర్: ఆల్పపీడనం కారణంగా జిల్లాలో మంగళవారం తెల్లవారుజాము నుంచి బుధవారం ఉదయం వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా కొండాపురం, మైలవరం, పెద్దముడియం, జమ్మలమడుగు. కలసపాడు, ఆట్లూరు మండలాలు మినహా మిగతా 30 మండలాల్లో వర్షం కురిసింది. జిల్లాలో చాలా మండలాల్లో ప్రస్తుతం ఉల్లిపంట కోతలు ప్రారంభించారు. తడికి ఉల్లిగడ్డలు దెబ్బతింటాయని ఉల్లి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ వర్షం వరిపంట సాగు చేసిన రైతులకు చాలా మేలు.వరికి సోకిన చీడపీడలు తొలిగి పంట ఏపుగా పెరిగే అవకాశశం ఉంటుంది. మిగతా ఆరుతడి పంటలైన పత్తి, వేరుశనగ, పసుపు, మొక్కజొన్న, సజ్జ పంటలకు, మామిడి, సపోట, చీని, నిమ్మ, డ్రాగెన్ ప్రూట్ వంటి ఉద్యాన పంటలకు కూడా ఈ వర్షం మేలేనని రైతులు తెలిపారు. చాపాడులో అత్యధికంగా 80.2 మిల్లీమీటర్లు, కాశినాయనలో అత్యల్పంగా 1 మిల్లీమీటర్ వర్షం కురిసింది.

జిల్లాలో వర్షం