ప్రయాణికుల మన్ననలు పొందేలా సేవలు | - | Sakshi
Sakshi News home page

ప్రయాణికుల మన్ననలు పొందేలా సేవలు

Sep 18 2025 11:07 AM | Updated on Sep 18 2025 11:07 AM

ప్రయాణికుల మన్ననలు పొందేలా సేవలు

ప్రయాణికుల మన్ననలు పొందేలా సేవలు

కడప కోటిరెడ్డిసర్కిల్‌: విమాన ప్రయాణీకుల మన్ననలు పొందేలా సేవలు అందిస్తున్నామని కడప ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ సుజిత్‌కుమార్‌ పొదార్‌ తెలిపారు. బుధవారం ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా ఆదేశాల మేరకు కడప ఎయిర్‌పోర్టులో యాత్రి సేవా దివస్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు యాత్రికులను ఆకట్టుకున్నాయి. తొలుత వివిధ ప్రాంతాల నుంచి కడపకుచేరుకున్న యాత్రికులకు డైరెక్టర్‌తోపాటు ఇతర అధికారులు స్వాగతం పలికారు.అలాగే రక్తదాన శిబిరంలో పలువురు స్వచ్చందంగాపాల్గొని రక్తదానం చేశారు. అనంతరం అతిథులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డితోపాటు ఓం శాంతి సంస్థ ప్రతినిధులు, రామకృష్ణ మిషన్‌ సభ్యులు, ఎయిర్‌పోర్టు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement