
విద్యుత్ షాక్‌తో బర్రె మృతి
చింతకొమ్మదిన్నె : చింతకొమ్మదిన్నె మండలం బాలుపల్లి నుంచి గోపులాపురం వెళ్లే దారిలో విద్యుత్ షాక్‌తో బర్రె మృతి చెందింది. బాలుపల్లి గ్రామానికి చెందిన బొమ్మేపల్లె నారాయణమ్మ పశువులను మేపుతుండగా రోడ్డు పక్కగా ఉన్న విద్యుత్ స్తంభం వద్ద బర్రెకు, నారాయణమ్మకు విద్యుత్ షాక్ తగిలింది. బర్రె మృతి చెందగా, నారాయణమ్మ స్వల్ప గాయాలతో ప్రాణాలు దక్కించుకున్నారు. సమీపంలోని గ్రామస్తులు స్పందించి వెంటనే 108 అంబులెన్స్ ద్వారా నారాయణమ్మను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన బర్రె సుమారు లక్ష రూపాయలు పైగా విలువ చేస్తుందని, విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని గ్రామస్తులు ఆరోపించారు.
గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
జమ్మలమడుగు : వేపరాల గ్రామానికి చెందిన చిమ్మని వెంకట రమణ(32) పెన్నానదిలో ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు. మైలవరం నుంచి వస్తున్న నీటిని నిలుపుదల చేసి గాలింపు చర్యలు చేపట్టడంతో మృతదేహం లభ్యమైందని ఎస్‌ఐ శ్యాంసుందర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం మృతదేహాన్ని జమ్మలమడుగు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా అంత్యక్రియలు చేసేందుకు బంధువులు ముందుకు రాకపోవడంతో పోలీసులు మే ఐహెల్ప్‌యు సంస్థ పట్టణ అధ్యక్షుడు అహమ్మద్ హుస్సేన్‌కు ఫోన్ చేసి వివరించారు. దీంతో ఫౌండర్ లక్ష్మణ్‌రావు, సభ్యులతో కలిసి హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు.
అంత్యక్రియలు చేసేందుకు
ముందుకు రాని బంధువులు

విద్యుత్ షాక్‌తో బర్రె మృతి