ట్రిపుల్‌ ఐటీలో ఆటోమ్యాట్‌ యాప్‌ ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

ట్రిపుల్‌ ఐటీలో ఆటోమ్యాట్‌ యాప్‌ ఆవిష్కరణ

Sep 3 2025 4:35 AM | Updated on Sep 3 2025 4:35 AM

ట్రిపుల్‌ ఐటీలో ఆటోమ్యాట్‌ యాప్‌ ఆవిష్కరణ

ట్రిపుల్‌ ఐటీలో ఆటోమ్యాట్‌ యాప్‌ ఆవిష్కరణ

ట్రిపుల్‌ ఐటీలో ఆటోమ్యాట్‌ యాప్‌ ఆవిష్కరణ

వేంపల్లె : ఆర్జీయూకేటీ పరిధిలోని ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో ఆర్‌ – 21 బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు రూపొందించిన ఆటోమ్యాట్‌ యాప్‌ను ఆర్కేవ్యాలీ ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ కుమార స్వామి గుప్తా ఆవిష్కరించారు. మంగళవారం వేంపల్లె మండలంలోని ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో ఆటోమ్యాట్‌ యాప్‌ ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్కేవ్యాలీ ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ కుమార స్వామి గుప్తా మాట్లాడుతూ విద్యార్థులు ప్రతిరోజు ఎదుర్కొనే ఆటో సమస్యలను పరిష్కరించడానికి ఈ యాప్‌ ప్రత్యేకంగా రూపకల్పన చేశామన్నారు. ఈ ఆటో యాప్‌ ద్వారా షెడ్యూల్‌ ప్రకారం ఆటోలు అందుబాటులోకి వస్తాయని, నిజమైన, పారదర్శకమైన ధరల విధానంతోపాటు విద్యార్థుల భద్రత కోసం కంప్లైంట్‌ ఆప్షన్‌ ఉంటుందన్నారు. అలాగే తప్పు ప్రవర్తన, అధిక చార్జీలు, మొదలగు సమస్యలకు పరిష్కారం ఉంటుందన్నారు. యాప్‌ను ఆటో డ్రైవర్లకు చెందిన మొబైల్స్‌లో ఇన్‌స్టాల్‌ చేసి వారికి అవగాహన కల్పించారు. అనంతరం ఆటో యాప్‌ను రూపొందించిన విద్యార్థులు శివశంకర్‌, సాయినాథ్‌, రవితేజ, అంకిత్‌ కుమార్‌, సాయికుమార్‌, మణికుమార్‌లను అభినందించి సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో పరిపాలన అధికారి పెనుగొండ రవికుమార్‌, డీన్‌ అకడమిక్‌ రమేష్‌ కై లాష్‌, సీఎస్సీహెచ్‌ఓడీ రత్నకుమారి, సెక్యూరిటీ ఆఫీసర్‌ శరవణ కుమార్‌, అసోసియేట్‌ డీన్‌న్‌ వీరరాఘవ రెడ్డి, అడ్మిన్‌ లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement