మహానేతకు ఘన నివాళి | - | Sakshi
Sakshi News home page

మహానేతకు ఘన నివాళి

Sep 3 2025 4:35 AM | Updated on Sep 3 2025 4:35 AM

మహానే

మహానేతకు ఘన నివాళి

వైఎస్సార్‌... భౌతికంగా మనిషి దూరమై పదహారేళ్లు గడిచాయి.. ఓ నాయకుడిగా ఆయన చేసిన మంచి ఇప్పటికీ ఉంది.. ఎప్పటికీ నిలిచే ఉంటుంది.. పేదల గుండె గడపల్లో ఆ నామం నిత్యం ధ్వనిస్తూనే ఉంది. ఆయన రూపం కళ్లముందు కదలాడుతూనే ఉంది. దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్సార్‌ వర్థంతి సందర్భంగా ఆ సత్యం నిరూపితమైంది. జోహార్‌..వైఎస్సార్‌ అనే నినాదం ఊరూరా మార్మోగింది. జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌ వర్థంతి కార్యక్రమాలు జరిగాయి. పల్లె..పట్టణం తేడా లేకుండా అభిమానులు అన్నదానాలు చేశారు. రక్తదాన శిబిరాలు, పాలాభిషేకాలు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

కమలాపురంలో రోగులకు పండ్లు పంపిణీ చేస్తున్న నరేన్‌ రామాంజులరెడ్డి

పులివెందులలో రక్తదానం చేస్తున్న వైఎస్సార్‌ అభిమానులు

పేదలకు పండ్లు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి

పులివెందుల పట్టణంలోని భాకరాపురం వైఎస్సార్‌ ఆడిటోరియంలో కడప పార్లమెంటు సభ్యులు వైఎస్‌ అవినాష్‌రెడ్డి, మున్సిపల్‌ ఇన్‌చార్జి వైఎస్‌ మనోహర్‌రెడ్డిల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. పెద్ద ఎత్తున యువతీ, యువకులు ఇందులో రక్తదానం చేశారు. పులివెందుల బైపాస్‌లో ఉన్న వైఎస్సార్‌ విగ్రహాలను అందంగా అలంకరించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

కడప కార్పొరేషన్‌: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 16వ వర్థంతి సందర్భంగా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు నివాళి అర్పించారు. కడప నగరంలోని హెడ్‌పోస్టాఫీసు వద్దనున్న వైఎస్సార్‌ విగ్రహానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, మేయర్‌ సురేష్‌ బాబు, ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్సార్‌ చిత్రపటానికి పూలమాల వేసి ఆయన సేవలను కొనియాడారు.

మైదుకూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు వద్దనున్న వైఎస్సార్‌ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

జమ్మలమడుగు పట్టణంలో టీటీడీ కళ్యాణ మండపం వద్దనున్న వైఎస్సార్‌ విగ్రహానికి ఎమ్మెల్సీ పి. రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులు అర్పించారు. యర్రగుంట్ల పట్టణంలో బస్టాండు వద్దనున్న వైఎస్సార్‌ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళి అర్పించారు.

కమలాపురం వైఎస్సార్‌సీపీ కార్యాలయం ఎదుట ఉన్న వైఎస్సార్‌ విగ్రహానికి కమలాపురం నియోజవర్గ ఇన్‌చార్జి నరేన్‌ రామాంజులరెడ్డి పూలమాల వేసి అంజలి ఘటించారు. ప్రభుత్వ హాస్పిటల్‌లో మాజీ ప్రభుత్వ సలహాదారు సంబటూరు ప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. అనాథ బాలుర క్షాత్రాలయంలో మార్కెట్‌ యార్డు మాజీ డైరెక్టర్‌ పుల్లారెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం చేశారు.

ప్రొద్దుటూరు పట్టణంలో మైదుకూరు రోడ్డులో అన్వర్‌ హాలు వద్ద, మున్సిపల్‌ కార్యాలయంలో ఉన్న వైఎస్సార్‌ విగ్రహాలకు మున్సిపల్‌ ఛైర్మెన్‌ బి. లక్ష్మిదేవి, వైస్‌ చైర్మన్‌ పాతకోట బంగారుమునిరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె. నాగేంద్రారెడ్డి, ఆప్కాబ్‌ మాజీ ఛైర్‌పర్సన్‌ మల్లేల ఝాన్సీ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

బద్వేల్‌ పట్టణంలోని గుంతపల్లె క్రాస్‌ రోడ్డు, బైపాస్‌ రోడ్డులో ఉన్న వైఎస్సార్‌ విగ్రహాలకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి గురుమోహన్‌, మున్సిపల్‌ అధ్యక్షుడు సుందరరామిరెడ్డి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నిరాశ్రయుల వసతి గృహంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

వైఎస్సార్‌ సేవలను స్మరించుకున్న నేతలు

జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు

మహానేతకు ఘన నివాళి1
1/6

మహానేతకు ఘన నివాళి

మహానేతకు ఘన నివాళి2
2/6

మహానేతకు ఘన నివాళి

మహానేతకు ఘన నివాళి3
3/6

మహానేతకు ఘన నివాళి

మహానేతకు ఘన నివాళి4
4/6

మహానేతకు ఘన నివాళి

మహానేతకు ఘన నివాళి5
5/6

మహానేతకు ఘన నివాళి

మహానేతకు ఘన నివాళి6
6/6

మహానేతకు ఘన నివాళి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement