
● పార్వతీ తనయా.. పాహిమాం
మేళతాళాలు...డప్పు వాయిద్యాలు...బాణాసంచా పేలుళ్లు, యువత కేరింతలు, మిన్నంటిన భక్తజన కోలాహలం నడుమ ఐదవరోజైన ఆదివారం కడప నగరంతోపాటు జిల్లా అంతటా గణేష్ నిమజ్జన వేడుకలు నేత్ర పర్వంగా సాగాయి. చతుర్థి నుంచి భక్తుల పూజా నైవేద్యాలు అందుకున్న గణపతి వచ్చే ఏడాది మళ్లీ కలుద్దామంటూ గంగ ఒడికి తరలి వెళ్లారు. నిమజ్జనం సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు జరిగాయి.కడపలోని రాజీవ్‌మార్గ్‌లో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని జెడ్పీ చైర్మన్ రామగోవిందరెడ్డి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పండుగలు ప్రజల మధ్య ఐక్యతను పెంచుతాయని, అలాంటి పర్వదినాల్లో ముఖ్యమైనది వినాయక చవితి అని ఆయన అన్నారు. నిమజ్జనోత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాటు చేసింది. దీంతో నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది.
–కడప సెవెన్‌రోడ్స్
దేవునికడప చెరువులో గంగమ్మఒడికి చేరుతున్న గణపతి
వినాయక నిమజ్జన ఉత్సవంలో చిన్నారుల కోలాటం

● పార్వతీ తనయా.. పాహిమాం

● పార్వతీ తనయా.. పాహిమాం

● పార్వతీ తనయా.. పాహిమాం