
శ్రీరంగనాథా..నమోస్తుతే
పులివెందుల టౌన్: పులివెందుల మున్సిపాలిటిలోని అతి పురాతనమైన శ్రీరంగనాథస్వామి ఆలయంలో నూలు పూజ ప్రవిత్రోత్సవాల్లో భాగంగా నాలుగోరోజు శ్రీరంగనాథుడు శేష వాహనంపై సతీసమేతంగా భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు కృష్ణరాజేష్‌శర్మ ఉభయదారులచే ప్రత్యేక పూజలు జరిపించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. నూలుపూజ పవిత్రోత్సవాలు 9రోజులు జరగనున్నాయి. ఆలయ చైర్మన్ చింతకుంట సుధీకర్‌రెడ్డి, ఈఓ రమణ ఏ ర్పాట్లు పర్యవేక్షించారు. భక్తులు పాల్గొన్నారు.
కడప సెవెన్‌రోడ్స్: ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్)ను సోమవారం సభాభవన్‌లో నిర్వహిస్తున్నట్లు డీఆర్వో విశ్వేశ్వర నాయుడు తెలిపారు. అర్జీదారులు వారి అర్జీలు మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌లో అర్జీలు నమోదు చేసుకోవచ్చన్నారు. ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అర్జీల స్వీకరణ కార్యక్రమం జిల్లా కేంద్రంతోపాటు మండల, మున్సిపల్ స్థాయిలో జరుగుతుందన్నారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులను సమీపంలోని మండల, మున్సిపల్ కార్యాలయాల్లో కూడా సమర్పించుకోవచ్చునన్నారు.
డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం
డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం సోమ వారం ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు జరుగుతుందన్నారు.ప్రజలు 08562– 244437 ల్యాండ్ లైన్ నంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలను విన్నవించుకోవచ్చునన్నారు.
కాల్ సెంటర్ సేవలు వినియోగించుకోవాలి
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రారంభించిన మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని డీఆర్వో విశ్వేశ్వరనాయుడు పిలుపునిచ్చారు. అర్జీదారులు తమ అర్జీలు పరిష్కారం కాకపోయినా లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబబర్‌కు కాల్ చేయవచ్చన్నారు.