
ఏసీఏ సౌత్‌జోన్ అండర్–23 మల్టీడే మ్యాచ్‌లు ప్రారంభం
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ఏసీఏ సౌత్‌జోన్ అండర్–23 మల్టీ డే మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. శనివారం కేఎస్‌ఆర్‌ఎం క్రికెట్ మైదానంలో తొలి రోజు కడప–చిత్తూరు జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన కడప జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన చిత్తూరు జట్టు 90 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 346 పరుగులు చేసింది. ఆ జట్టులోని జెనిక్ దాస్ 197 బంతుల్లో 12 ఫోర్టు, 2 సిక్సర్లతో 109 పరుగులు, రెడ్డి రుషిల్ 142 బంతుల్లో 84 పరుగులు, తేజ రెడ్డి 64 బంతుల్లో 60 పరుగులు, బీఎం వెంకటేష్ 92 బంతుల్లో 54 పరుగులు చేశాడు. కడప జట్టులోని ఎస్‌ఎండీ అస్లామ్ 2 వికెట్లు తీశాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది.
వైఎస్‌ఆర్‌ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో..
వైఎస్‌ఆర్‌ఆర్ క్రికెట్ స్టేడియంలో జరిగిన మరో మ్యాచ్‌లో తొలి రోజు నెల్లూరు–కర్నూలు జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన నెల్లూరు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 82 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 374 పరుగులు చేసింది. ఆ జట్టులోని ఎస్. సోహన్ వర్మ 209 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లతో 166 పరుగులు చేసి అద్భుతంగా ఆడాడు. పవన్ రిత్విక్ 79 పరుగులు, మాధవ్ 43 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని అక్షిత్‌రెడ్డి 2 వికెట్లు, సాయి ప్రణవ్ చంద్ర 2 వికెట్లు తీశారు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది.

ఏసీఏ సౌత్‌జోన్ అండర్–23 మల్టీడే మ్యాచ్‌లు ప్రారంభం

ఏసీఏ సౌత్‌జోన్ అండర్–23 మల్టీడే మ్యాచ్‌లు ప్రారంభం

ఏసీఏ సౌత్‌జోన్ అండర్–23 మల్టీడే మ్యాచ్‌లు ప్రారంభం

ఏసీఏ సౌత్‌జోన్ అండర్–23 మల్టీడే మ్యాచ్‌లు ప్రారంభం