
సకల మానవాళికి తల్లి ఆరోగ్యమాత
కడప సెవెన్‌రోడ్స్: ఆరోగ్యమాత సకల మానవాళికి తల్లిలా ప్రేమ కురిపించి ఆదరిస్తుందని కడప మాసాపేట విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ ఎ.జోసెఫ్‌రాజ్ అన్నారు. కడప నగరంలోని ఆరోగ్యమాత క్షేత్రంలో జరుగుతున్న ఉత్సవాల్లో రెండవ రోజైన శనివారం రాయచోటి విచారణ గురువులు రెవరెండ్‌ఫాదర్ ఆనంద్ దివ్యబలిపూజ సమర్పించారు. తొలుత జపమాల చెప్పుకొంటూ గుడిచుట్టూ దేవమాతను ఊరేగించారు. ఈ సందర్భంగా హాజరైన భక్తులనుద్దేశించి జోసెఫ్‌రాజ్ మాట్లాడారు. మానవాళిని లోకానికి పరిచయం చేసేది మన తల్లి అయితే, దీవెనలు, వరాలను అందించేది ఆరోగ్యమాత అని పేర్కొన్నారు. సంతాన ప్రదాతగా ఆమె మహిమగల తల్లి అని, ఆమెను ఆరాధించి ప్రార్థించి సకల ఐశ్వర్యం, ఆరోగ్యాలను పొందాలన్నారు. మరియమాత దేవునికే కాకుండా మానవాళికి తల్లి అని కొనియాడారు. ఆమె చూపిన అడుగుజాడల్లో నడిచి దేవుని సన్నిధికి చేరుకోవాలన్నారు. దేవుని వాక్యనుసారంగా మానవాళి నడుచుకోవాలన్నారు. అప్పుడే పరలోకంలో స్థానముంటుందని తెలిపారు. రెవరెండ్ ఫాదర్ ఆనంద్ మాట్లాడుతూ ప్రజలంతా సుఖ శాంతులతో ఉండాలని దేశం, రాష్ట్రం కోసం ప్రార్థించారు. ఉత్సవాల్లో బాగంగా పాటలు, మరియతల్లి తేరు, దివ్య బలిపీఠం, సిస్టర్స్ ఆఫ్ క్రీస్తు జ్యోతి, మదర్ హౌస్ ప్రతినిధులు అలంకరించారు. ఈ కార్యక్రమంలో పుణ్యక్షేత్ర డైరెక్టర్ రెవ ఫాదర్ ఎండీ ప్రసాదరావు,గురువులు బి.జాన్నేస్, ఎం.డేవిడ్‌రాజు, విజయరావు, వైటీఏ విక్టర్, సెబాస్టిన్, ఆనందరావు, డేవిడ్ రాజేందర్, ఆంథోని, జార్జి, జయరాజు, అంజలిన, సుందరమ్మతోపాటు పెద్ద ఎత్తున విశ్వాసులు పాల్గొన్నారు.

సకల మానవాళికి తల్లి ఆరోగ్యమాత

సకల మానవాళికి తల్లి ఆరోగ్యమాత