
గరుడవాహనంపై శ్రీరంగనాథుడు
పులివెందుల టౌన్: పులివెందుల మున్సిపాలిటీలోని శ్రీరంగనాథస్వామి ఆలయంలో నూలు పూజ పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మూడో రోజైన శనివారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీరంగనాథస్వామి గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో అర్చకులు కృష్ణరాజేష్‌శర్మ ఉభయదారులచే ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ ఉత్సవాలను ఆలయ చైర్మన్ సుధీకర్‌రెడ్డి, ఈఓ కేవీ రమణ పర్యవేక్షించారు.
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: మద్యం బార్లను లక్కీ డ్రా ద్వారా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి సమక్షంలో కేటాయించారు. శనివారం కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్ హాలులో ఈ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో ఓపెన్ కేటగిరీలో నోటిఫై చేసిన 27 బార్లలో 12 బార్లకు, గీత కులాలకు నోటిఫై చేసిన 2 బార్లు సక్సెస్ అప్లికెంట్స్‌కు కేటాయించారు. బార్ల అప్లికేషన్ ఫీజు రూపంలో రూ. 12 కోట్లు, ప్రాసెసింగ్ ఫీజు రూపంలో రూ. 6.10 లక్షలు, మొదటి విడత లైసెన్స్ ఫీజు రూపంలో రూ. 1.19 కోట్ల రెవెన్య లభించింది. ఈ కార్యక్రమంలో ఎకై ్సజ్‌శాఖ డీసీ జయరాజు, అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖరెడ్డి, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్‌శాఖ అధికారి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: కడప టెలికాం ఉద్యోగుల సహకార గృహ నిర్మాణ సంఘం లిమిటెడ్ రిజిస్టర్ నంబర్ 1415 కడప వైఎస్సార్ కడప జిల్లా ఎన్నికలు ఏకగ్రీవం అయినట్లు ఎన్నికల అధికారులు సుబ్రహ్మణ్యం, మురళి పేర్కొన్నారు. శని వారం నగరంలోని బీఎస్‌ఎన్‌ఎల్ జీఎం కార్యాలయంలో ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధ్యక్షులుగా కళ్యా సుధాకర్, ఉపాధ్యక్షులుగా ఆకుల సుబ్బారావు, కార్యదర్శిగా ఎం.సి.సుబ్బారెడ్డి, సభ్యులుగా ఎ.వెంకటేశ్వర్లు, బి.నాగరాజు, ఎం.రఘురామయ్య, వి.వెంకట రమణయ్య ఎన్నికయ్యారని తెలిపారు. ఏకగ్రీవంగా ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ ఉద్యోగుల ఇంటి స్థలాల పరిరక్షణకు కృషి చేస్తామని చెప్పారు. సొసైటీ తరఫున ఉద్యోగులకు, పెన్షనర్లకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు.

గరుడవాహనంపై శ్రీరంగనాథుడు