
కూలిన మట్టి మిద్దె
– తప్పిన పెనూ ప్రమాదం
ఎర్రగుంట్ల : మండల కేంద్రమైన యర్రగుంట్ల పురపాలక సంఘం పరిధిలోని వినాయకనగర్ కాలనీలో నివాసం ఉండే మరియమ్మ ఇల్లు ఇటివల కూరిసిన వర్షాలకు తడిసి దూళాలు విరిగి పోయి శుక్రవారం తెల్లవారిజామున కూలి పోయింది. ఆ సమయంలో మరియమ్మ ఇంటిలో లేక పోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ సందర్భంగా బాధితరాలు మరియమ్మ మాట్లాడుతు వినాయకనగర్ కాలనీలో మట్టి మిద్దెలో నివాసం ఉంటున్నట్లు తెలిపింది. అయితే ఇటివల కురిసిన వర్షాల వల్ల మిద్దె అంత తడిసి వర్షం నీటితో ఊరుస్తుండేదన్నారు. గురువారం పని మీద బయటకు వెళ్లినట్లు తెలిపారు. శుక్రవారం వచ్చి చూడగానే మిద్దె అంతా కూలిపోయి ఉందన్నారు. ఇంటిలో సామగ్రి అంతా మట్టిపాలైందని వాపోయింది. ప్రభుత్వం ఆదుకొని ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం సాయం అందించాలని బాధితరాలు వేడుకుంది.
చైన్ స్నాచింగ్
కలసపాడు : మండలంలోని పోరుమామిళ్ల – కలసపాడు ప్రధాన రహదారి సిద్ధమూర్తిపల్లె వద్ద శుక్రవారం సాయంత్రం మహిళ మెడలో నుంచి బంగారు సరుడురె దుండగుడు లాక్కెళ్లిన సంఘటన చోటు చేసుకుంది. సిద్ధమూర్తిపల్లెకు చెందిన పాలకొలను మల్లేశ్వరి గడ్డి మోపును ఎత్తుకుని వస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి పల్సర్ బైక్‌పై వచ్చి ఆమె మెడలోని మూడు తులాల బంగారు సరుడు లాక్కెళ్లాడు. వెంటనే బాధితురాలు కలసపాడు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలాన్ని పోరుమామిళ్ల సీఐ డి.శ్రీనివాసులు, కలసపాడు ఎస్‌ఐ తిమోతి పరిశీలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తిమోతి తెలిపారు.
రిజిస్ట్రేషన్లు రెన్యూవల్ చేసుకోవాలి
కడప కోటిరెడ్డిసర్కిల్ : స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థల రిజిస్ట్రేషన్లను సెప్టెంబరు 30వ తేదీలోపు రెన్యూవల్ చేసుకోవాలని తిరుపతి ఆదాయపు పన్నుశాఖ అధికారి శివశంకర్ సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎస్వీసీఈ భవనంలో తిరుపతి ఆదాయపు పన్ను అధికారి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఆదాయపు పన్ను సంచాలకులు బాలకృష్ణ, అదనపు సంచాలకులు సుమిత ఆదేశాల మేరకు పన్ను చట్టంలోని మినహయింపుల నూతన సవరణపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించి సందేహాల నివృత్తికి 89859 71460 నెంబరులో సంప్రదించాలన్నారు. కడప ఆదాయపు పన్నుశాఖ అధికారి సత్యనారాయణ, చార్టెడ్ అకౌంటెంట్లు, ట్యాక్స్ కన్సెల్టెంట్లు, స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

కూలిన మట్టి మిద్దె